ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకోండి
ABN, Publish Date - Jan 20 , 2025 | 11:40 PM
రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామం లో సర్వే నెం.537లో గల సుమారు 30 ఎకరాల భూముల్లో పాగా వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యద ర్శి ఒమ్మి రమణ డిమాండ్ చేశారు.
బొబ్బిలి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామం లో సర్వే నెం.537లో గల సుమారు 30 ఎకరాల భూముల్లో పాగా వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యద ర్శి ఒమ్మి రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ 2006-07లో 65 మంది పేదలకు ఒక్కొక్కరికి ఎకరా భూమి చొప్పున ప్రభు త్వం పంపిణీ చేసిందన్నారు. ఇందులో సుమారు 30 ఎకరాల భూమిని సాలూరు పట్టణానికి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల దంప తులు బినామీ పేర్లతో అనుభవిస్తున్నార న్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసు కుని, పేదలకు భూములను అప్పగించా లని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షం లో ఆ భూముల్లో ఎర్రజెండాలను ఎగరేసి తామే పేదలకు పంపిణీ చేస్తామ న్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట అప్పన్న, బొబ్బిలి సీపీఐ పట్టణ కార్యదర్శి మునకాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - Jan 20 , 2025 | 11:40 PM