ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చేనేతకు ఊతం!

ABN, Publish Date - Jan 09 , 2025 | 12:35 AM

support to the weaver! చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన కూటమి ప్రభుత్వం కార్మికులకు ఊతమిచ్చే త్రిఫ్ట్‌ పథకాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేతన్నలు తమకు వచ్చే ఆదాయంలో 8 శాతాన్ని డిపాజిట్‌ చేస్తే..దానికి 16 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలుపుతుంది. 90 రోజుల్లో ఆ మొత్తం చేనేత కార్మికుడికి అందుతుంది. నేతన్నల పొదుపును ప్రోత్సహించే ఈ పథకాన్ని గత ప్రభుత్వం విస్మరించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నేతన్నల సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టింది.

మగ్గం నేస్తున్న చేనేత కార్మికుడు

చేనేతకు ఊతం!

త్రిప్ట్‌ పథకం పునరుద్ధరణ

నేతన్నల పొదుపునకు ప్రోత్సాహం

డిపాజిట్‌కు రెండు రెట్లు అదనపు సాయం

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన కూటమి ప్రభుత్వం కార్మికులకు ఊతమిచ్చే త్రిఫ్ట్‌ పథకాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేతన్నలు తమకు వచ్చే ఆదాయంలో 8 శాతాన్ని డిపాజిట్‌ చేస్తే..దానికి 16 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలుపుతుంది. 90 రోజుల్లో ఆ మొత్తం చేనేత కార్మికుడికి అందుతుంది. నేతన్నల పొదుపును ప్రోత్సహించే ఈ పథకాన్ని గత ప్రభుత్వం విస్మరించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నేతన్నల సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టింది.

రాజాం, జనవరి 8(ఆంధ్రజ్యోతి):

త్రిఫ్ట్‌ పథకం 2014 నుంచి 2019 వరకూ అమలైంది. అప్పట్లో ప్రతి సహకార సంఘంలో ఈ పథకంలో 150 మంది వరకూ నమోదయ్యారు. ఆర్థికంగా లబ్ధి పొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పథకాన్ని నిలిపివేసింది. సొసైటీలకు ఎన్నికలు పూర్తయ్యాక లబ్ధిదారుల ఎంపిక సైతం ప్రారంభం కానుంది. చేనేత సొసైటీల ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వివిధ కారణాలతో జాప్యం జరుగుతోంది.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో 25 సహకార సంఘాల పరిధిలో 4 వేల మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు 12 సంఘాలే కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. 2500 చేనేత కుటుంబాల్లో కేవలం 2200 మంది మాత్రమే మగ్గాలపై పనిచేస్తున్నట్టు సమాచారం. అయితే గత ఐదేళ్లలో పరిణామాలు కూడా చేనేత వృత్తిదారులు తగ్గడానికి ఓ కారణంగా కనిపిస్తోంది. ప్రధానంగా పట్టు, నూలు వంటి మూడిసరుకులపై కేంద్ర ప్రభుత్వం రాయితీ ఎత్తేసింది. నూలు, రంగులు, రసాయనాలపై కేంద్ర ప్రభుత్వం 18 జీఎస్టీని విధించింది. అటు వైసీపీ హయాంలో చేనేత హస్తం అన్న పథకం తప్పించి సొసైటీలకు ఎటువంటి సాయం చేయలేదు. ఆప్కోకు బకాయిలు కూడా చెల్లించలేదు. గతంలో ప్రభుత్వాలు రాయితీపై బ్యాంకు రుణాలు, మగ్గాలు, ఇతరత్రా పరికరాలు అందించేవి. చేనేత కార్పొరేషన్‌ ద్వారా విరివిగా రుణాలు ఇచ్చేవి. కూటమి ప్రభుత్వం కూడా సొసైటీలకు జవసత్వాలు నింపాలని భావిస్తోంది. గతంలో మాదిరిగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. తద్వారా సొసైటీల్లో సభ్యులు క్రియాశీకలమవుతారని అంచనా వేస్తోంది. తరువాత త్రిఫ్ట్‌ పథకం అమలుచేస్తే లబ్ధిదారులు పెరుగుతారని అభిప్రాయపడుతోంది.

చేనేత శాల ఏర్పాటుకు నిర్ణయం

మంత్రి నారా లోకేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో చేనేత కార్మికులు అధికం. లోకేశ్‌ చొరవతో అక్కడ చేనేత శాల ఏర్పాటుచేశారు. అటువంటి చేనేత శాల జిల్లాలో ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాజాం మండలం పెనుబాక సరైన ప్రాంతమని జిల్లా చేనేత జౌళి శాఖ అధికారులు ప్రతిపాదించారు. అదే కానీ కార్యరూపం దాల్చితే చాలా మంది కార్మికులకు ఉపాధి మెరుగుపడే అవకాశం ఉంది. పని తెలిసి.. ఇంటి వద్ద మగ్గం ఏర్పాటుచేసుకోలేకపోయిన వారు ఇక్కడ ఉపాధి పొందవచ్చు. జిల్లాలో ఐదు సొసైటీలు సహకార బ్యాంకుల ద్వారా రుణాలు పొంది..ముడి సరుకులు కొనుగోలుచేసి వస్త్రాలు తయారుచేస్తున్నాయి. అయితే చేనేత శాలలో మగ్గాలపై అనుభవం ఉండి..సొసైటీలో సభ్యత్వం కలిగిన వారందరికీ ఉపాధి కల్పిస్తారు. చేనేత కుటుంబాల్లో టైలరింగ్‌ చేసేవారికి వస్త్రాల కుట్టుపని అప్పగిస్తారు. అవగాహన లేకపోతే నైపుణ్య కేంద్రం ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తారు.

త్రిఫ్ట్‌ పథకం పునరుద్ధరించింది

చేనేత అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. త్రిఫ్ట్‌ పథకాన్ని పున:ప్రారంభిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సొసైటీలకు ఎన్నికలు పూర్తిచేసి త్రిఫ్ట్‌ పథకానికి లబ్ధిదారులను ఎంపికచేస్తాం. జిల్లాలో చేనేత శాల ఏర్పాటుకు రాజాం మండలం పెనుబాకలో ఎకరం భూమిని సైతం గుర్తించి ప్రభుత్వానికి నివేదించాం.

- ఆర్వీ మురళీకృష్ణ, ఏడీ, చేనేత జౌళిశాఖ, విజయనగరం

Updated Date - Jan 09 , 2025 | 12:35 AM