ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

What are you doing? సార్లూ.. మీరేం చేస్తున్నారు?

ABN, Publish Date - Feb 24 , 2025 | 11:52 PM

Sirs.. What are you doing? ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పాఠశాల.... అక్కడ చదువుకొన్న ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతరాత్ర వృత్తుల్లో రాణించి పేరు ప్రఖ్యాతలు సాధించారు. అయితే అటువంటి పాఠశాల నేడు వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది.

సీతంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల

తీరు మార్చుకోని ఉపాధ్యాయులు

ఆవేదనలో తల్లిదండ్రులు

సీతంపేట రూరల్‌, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పాఠశాల.... అక్కడ చదువుకొన్న ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతరాత్ర వృత్తుల్లో రాణించి పేరు ప్రఖ్యాతలు సాధించారు. అయితే అటువంటి పాఠశాల నేడు వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. సీతంపేటలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ పాఠశాల పేరు చెబితేనే అమ్మో! అనే మాట వినిపిస్తోంది. 1970 నుంచి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ఈ పాఠశాలకు ఉంది. అటువంటి పాఠశాలలో నేడు పిల్లలను చదివించాలంటేనే పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. పాఠశాలలో మొత్తంగా 240 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇక్కడ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదే పాఠశాలలో హైస్కూల్‌ ప్లస్‌ టూ కూడ నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ చదువుతున్న విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడంతో విద్యార్థులు చదువులు పక్కదారి పడుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వరుస సంఘటనలు..

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల వరుస సంఘటనలు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. మూడు నెలల కిందట పాఠశాలలో జరిగిన ఓ ఘటన బయటకు రాకుండా హెచ్‌ఎం, ఉపాఽధ్యాయులు జాగ్రత్త పడ్డారు. ఓ ఉపాధ్యాయుడి పై పోక్సో కేసు నమోదైంది. దీనిపై పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ పాఠశాల నుంచి వెలుగులోకి రాని సంఘటనలు ఇంకెన్ని ఉన్నాయోనన్న సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి.

హెచ్‌ఎం ఏమన్నారంటే..

సీతంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఎంతో క్రమశిక్షణగా ఉంచుతున్నామని, అయినప్పటికీ ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని హెచ్‌ఎం హేమసుందర్‌ తెలిపారు. మళ్లీ ఇలా జరగకుండా చూస్తామన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 11:52 PM