ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరు లైన్ల రోడ్డుతో ఇబ్బందులు

ABN, Publish Date - Jan 29 , 2025 | 12:20 AM

మండల పరిధిలోని రావివలస సమీపం నుంచి వెళ్తున్న ఆరు లైన్ల రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.

రామభద్రపురం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని రావివలస సమీపం నుంచి వెళ్తున్న ఆరు లైన్ల రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు మంగళ వారం ఈ రోడ్డు పనులు చేస్తున్న హెచ్‌జీ ఇన్‌ఫ్రా కంపె నీ వద్ద బైఠాయించారు. వాహనాలు వెళ్లకుండా అడ్డుకు న్నారు. ఈ రోడ్డు వల్ల గిరిజన గ్రామాల అనుసంధానం దెబ్బతింటుందని తెలిపారు. జీలికవలస నుంచి జమ్మువ లస పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ హైవే వల్ల రహ దారి సౌకర్యం లేకుండా పోయిందన్నారు. రైతుల భూము ల నుంచి మట్టి తీసుకుని వెళ్లి, గుంతలు కప్పకపోవడం తో ప్రమాదకరంగా మారాయన్నారు. పెదశలగాంకు వెళ్లే రహదారి పూర్తిగా మూసుకుపోయిందన్నారు. అలాగే ఎనుబరువు సమీపంలో చాలీచాలని బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో వాహనాలు రాలేని పరిస్థితి నెలకొందని, దీనివల్ల జీసీసీ సరుకులు తీసుకు వెళ్లే వ్యాను, ఇతర వాహనాలు వెళ్లలేవని, దీనిని తక్షణమే మూసివేసి పెద్ద అండర్‌ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్‌ చేశారు. గిరిజనుల అమాయకత్వం చూసుకుని కంపెనీ ప్రతినిధులు సస్యశ్యామలంగా ఉన్న తమ గ్రామాలను ధూళి, దుమ్ముతో నింపేశారని రావివలస మాజీ సర్పంచ్‌ అడారి జైరావు, చర్చి పాస్టర్‌ ప్రసాద్‌ ఆరోపించారు. సమస్యలను పరిష్కరిస్తేగానీ కంపెనీ ముఖద్వారం నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.

దీనిపై కంపెనీ సీనియర్‌ మేనేజర్‌ అంబళ్ల రవికుమార్‌ మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న సమస్యలను 15 రోజు ల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గిరిజన గ్రా మాల్లో రోడ్లు, తాగునీరు, పాఠశాల మరమ్మతులకు సీఎస్‌ ఆర్‌ నిధులు విడుదల చేశామని తెలిపారు. 15 రోజుల్లో ఈ సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గిరిజనులు హెచ్చరించారు.

Updated Date - Jan 29 , 2025 | 12:20 AM