గర్భిణులను వసతిగృహంలో చేర్పించాలి
ABN, Publish Date - Feb 24 , 2025 | 12:34 AM
గిరిశిఖర గ్రామాల్లో ఉన్న గర్భి ణులను తప్పనిసరిగా గర్భిణుల వసతిగృహంలో చేర్పించాలని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారులు టి.జగన్మోహనరావు, పీఎల్ రఘు అన్నారు.
సాలూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామాల్లో ఉన్న గర్భి ణులను తప్పనిసరిగా గర్భిణుల వసతిగృహంలో చేర్పించాలని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారులు టి.జగన్మోహనరావు, పీఎల్ రఘు అన్నారు. పట్టణంలోని వైటీసీలో ఉన్న గిరిశిఖర గ్రామాల గర్భిణుల వసతి గృహాన్ని వారు ఆదివారం తనిఖీ చేశారు. ప్రస్తుతం చేరిన గర్భిణులు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందిపై ఆరా తీశారు. గర్భిణులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. ఆయన వెంట వైటీసీ మేనేజర్ విద్యాసాగర్, వైద్య సిబ్బంది ఉన్నారు.
Updated Date - Feb 24 , 2025 | 12:35 AM