నిర్వహణ లేక.. సాగు నీరందక
ABN, Publish Date - Feb 16 , 2025 | 11:25 PM
: ఏడొంపులగెడ్డ ఆనకట్ట నిర్వహణ నీరుగారుతోంది. నిర్వహణ, డిజైన్ లోపం పుణ్యమాని ఆయ కట్టుకు నీరందడంలేదు.షట్టర్లు పూర్తిగా పాడవడంతోపాటుఇసుక మేట లువేసింది. కుడి, ఎడమ కాలువలు పూర్తిగా మూసుకుపోయాయి.
రామభద్రపురం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): ఏడొంపులగెడ్డ ఆనకట్ట నిర్వహణ నీరుగారుతోంది. నిర్వహణ, డిజైన్ లోపం పుణ్యమాని ఆయ కట్టుకు నీరందడంలేదు.షట్టర్లు పూర్తిగా పాడవడంతోపాటుఇసుక మేట లువేసింది. కుడి, ఎడమ కాలువలు పూర్తిగా మూసుకుపోయాయి.
మండలంలోని కొండకెంగువ వద్ద కొండలపై నుంచి వచ్చే నీటిని నిల్వచేసి ఆయకట్టుకు నీరందించేందుకు ఆనకట్ట నిర్మించాలని అప్పట్లో ఇరిగేషన్ అధికారులు డిజైన్ రూపకల్పన చేశా రు. సుమారు రూ.రెండు కోట్లతో 759 ఎకరాలకు సాగు నీరందించేందుకు 2000లో ఆనకట్ట నిర్మించారు. కోట శిర్లాం, కొండకెంగువ, మామిడివలస, దుప్పలపూడి, ముచ్చ ర్లవలస, ఆరికతోట గ్రామాల పంట పొలాలకు సాగు నీరందించాలని నిర్ధేశించారు. అయితే అప్పట్లో డిజైన్ లోపం వల్ల నీరు నిల్ల ఉండని పరిస్థితి నెలకొంది. దీంతో కుడి, ఎడమ కాలువల ద్వారా చుక్క నీరు అందడంలేదు. కొండలపై నుంచి వస్తున్న నీరంతా గెడ్డ నుంచి కిందికి వెళ్లి పోతోంది. దీంతో ఆనకట్ట ప్రారంభం నుంచే ఆయకట్టుకు చుక్క నీరందడంలేదు.ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ నిర్లక్ష్యం, నిర్వ హణ లేకపోవడంతో ఆనకట్ట వెనుక ఇసుకమేటలు పేరుకుపోయాయి. షట్టర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. బాడీవాల్ నుంచి నీరు పైనుంచి పార డంతో ఆనకట్ట దిష్టిబొమ్మలా మిగిలిపోయింది. రెండు దశాబ్దాలుగా నిర్వహణ లేకపోవడంతో కుడి, ఎడమ కాలువలు పిచ్చిమొక్కలతో నిండిపోయి పూడుకుపోయాయి. జంగిల్ క్లియరెన్స్ చేయకపోడంతో కాలువలు పూర్తిగా మట్టి, సిల్డ్‌తో నిండిపోయాయి. మదుములు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. కొండల్లో నుంచి ఏటా వర్షాకా లంలో వస్తున్న వేలాది క్యూసెక్యుల నీరు వృథాగా గెడ్డ ద్వారా సము ద్రంలోకి పోతోందని రైతులు వాపోతున్నారు. ఆనకట్ట నిర్మాణం జరిగి 25 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆనకట్ట పరిధిలో కనీసం ఒక్క లస్కర్‌నైనా నియమించలేదని రైతులు వాపో తున్నారు.ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏడొంపుల ఆనకట్టను డిజైన్ మార్చి నీరు కాలువలకు అందేలా మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా కొద్దేళ్లుగా ఏడొంపులగెడ్డ ఆనకట్ట నిర్లక్ష్యానికి గురైం దని ఇరిగేషన్ శాఖ ఏఈ హరి తెలిపారు. ఇటీవల ఆనకట్ట దుస్థితిపై బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన స్పందించి ప్రతిపాదనలు సిద్ధం చేయా లని ఆదేశించారని చెప్పారు. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతామని తెలిపారు.
Updated Date - Feb 16 , 2025 | 11:25 PM