ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

suicide కొండగుంపాంలో వివాహిత ఆత్మహత్య

ABN, Publish Date - Jan 22 , 2025 | 12:07 AM

మండలంలోని కొండగుంపాం గ్రామానికి చెందిన గరుగుబిల్లి ఆదిలక్ష్మి మంగళవారం తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

నెల్లిమర్ల, జనవరి 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండగుంపాం గ్రామానికి చెందిన గరుగుబిల్లి ఆదిలక్ష్మి మంగళవారం తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తండ్రి కెల్ల సూరప్పడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్ల మండలం కెల్ల గ్రామానికి చెందిన ఆదిలక్ష్మికి 20 ఏళ్ల క్రితం నెల్లిమర్ల మండలం కొండగుంపాం గ్రామానికి చెందిన గరుగుబిల్లి లక్ష్మణరావుతో వివాహమైంది. లక్ష్మణరావు నెల్లిమర్ల మండల విద్యాశాఖ కార్యాలయంలో సీఆర్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె కొంతకాలంగా కడుపు నొప్పి తో బాధపడుతోందని, ఆ బాధను భరించలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని తండ్రి సూరప్పడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Jan 22 , 2025 | 12:08 AM