ఉపాధి కార్యాలయానికి తాళం
ABN, Publish Date - Feb 01 , 2025 | 12:34 AM
సీతం పేట ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎన్‌ఆర్‌ఈ జీఎస్ కార్యాలయానికి టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు శుక్రవారం తాళం వేసి, నిరసన తెలిపారు.
సీతంపేట రూరల్, జనవరి 31(ఆంధ్రజ్యోతి): సీతం పేట ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎన్‌ఆర్‌ఈ జీఎస్ కార్యాలయానికి టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు శుక్రవారం తాళం వేసి, నిరసన తెలిపారు. కార్యాలయం వెలుపల బైఠాయించి అధికారు లు తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంలో జిల్లా మొత్తం మీద 100రోజుల ఉపాధి పనిదినాలు ఎక్కువగా కల్పించిన ఘనత సీతంపేటకే దక్కిందన్నారు. తాము ఇంతగా కష్టపడుతున్నా తమ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు. అన్ని మండలాల్లో ఈ ఏడాది ఉపాది సిబ్బందికి జనవరి నెల జీతాలకు సంబంధించి శ్లాట్‌లు ఆప్‌లోడ్ చేశారని, కానీ సీతంపేట మండలంలో మాత్రం చేయలే దని వారు ఆరోపించారు. ఎంపీడీవో తమ పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనపై ఎంపీడీవో కె.గీతాంజలిని వివరణ కోరగా సిబ్బందితో మాట్లాడి సమస్య పరిష్కరించామని చెప్పారు. ఇది చిన్న సమస్యేనని సమాధానమిచ్చారు.
Updated Date - Feb 01 , 2025 | 12:34 AM