ఏ సమస్య ఉన్నా తెలియజేయండి
ABN, Publish Date - Jan 28 , 2025 | 12:25 AM
వసతిగృహంతో ఉన్న గర్భిణులకు ఏ సమస్య వచ్చినా తనకు తెలియజేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
సాలూరు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): గర్భంతో ఉన్న మహిళ గర్భగుడిలో ఉన్న దేవతతో సమానం అని.. గిరిశిఖర గ్రామాల గర్భిణుల వసతిగృహంతో ఉన్న గర్భిణులకు ఏ సమస్య వచ్చినా తనకు తెలియజేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పట్టణంలోని వైటీసీలో గల గర్భిణుల వసతి గృహాన్ని ఆమె సోమవారం పరిశీలించారు. గర్భిణుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మినరల్ వాటర్ క్యాన్‌లతో నీటిని తీసుకుని వెళ్లి వారికి అందజేశారు. పాడైన ఆర్వో ప్లాంట్‌కు మరమ్మతులు చేయించారు. వసతి గృహంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణం తన దృష్టికి తీసుకుని రావాలని ఆధికారులకు ఆదేశించారు. గర్భిణులు ప్రసవం అయి ఇంటికి వెళ్లే వరకు అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. తమకు జీతాలు సరిగ్గా అందడం లేదని సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఉన్నాతాధికారులతో మాట్లాడి జీతాలు త్వరలో జమ అయ్యేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆమె వెంట గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్.కృష్ణవేణి, వైటీసీ మేనేజర్ విద్యాసాగర్, టీడీపీ నాయకులు నిమ్మాది తిరుపతిరావు, ఆముదాల పరమేష్ ఉన్నారు.
Updated Date - Jan 28 , 2025 | 12:25 AM