House Canceled ఇళ్లు కట్టకపోతే రద్దు
ABN, Publish Date - Feb 05 , 2025 | 11:36 PM
"If the House is Not Built, It Will Be Canceled గృహాలు మంజూరైన లబ్ధిదారులు తక్షణమే నిర్మించుకోవాలని, లేకుంటే వాటిని రద్దు చేసి కొత్తవారికి కేటాయిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. బుధవారం మిర్తివలస, బలిజిపేట గ్రామాల్లో పర్యటిం చారు.
బలిజిపేట, ఫిబ్రవరి5(ఆంధ్రజ్యోతి): గృహాలు మంజూరైన లబ్ధిదారులు తక్షణమే నిర్మించుకోవాలని, లేకుంటే వాటిని రద్దు చేసి కొత్తవారికి కేటాయిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. బుధవారం మిర్తివలస, బలిజిపేట గ్రామాల్లో పర్యటిం చారు. ఉపాధి హామీ పనులు, గృహ నిర్మాణాలు, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేసిన గృహ నిర్మాణాల వేగవంతానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బలిజిపేటలో లబ్ధిదారు లకుఅవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. అప్పటికీ నిర్మాణాలు పూర్తి చేయడానికి ముందుకు రాకపోతే తమకు తెలియ జేయాలని సూచించారు. అనంతరం మిర్తివలసలో ఉపాధి హామీ వేతనదారుల హాజరును పరిశీలించారు. ఫారం పాండ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని, వేతనదారులకు గరిష్ట వేతనం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. మిర్తివలస చెరువు వద్ద జంగిల్ క్లియరెన్స్ చేయాలని, వర్షాలు కురిసినప్పుడు గండి పడ కుండా చూడాలని సూచించారు. రీసర్వే పనులు వేగవంతం చేయాలన్నారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారుల బరువు, ఎత్తును పరిశీలించారు. ప్రతిఒక్కరికీ టేక్ హోమ్ రేషన్ అందించాలని, రక్తహీనత నివారణే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్, హౌసింగ్ ఇన్‌చార్జి అధికారి పి.ధర్మారెడ్డి, మండల అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
మాతాశిశు మరణాలు సంభవించరాదు
పార్వతీపురం, ఫిబ్రవరి5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఒక్క మాతా శిశు మరణం కూడా సంభవించరాదని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు. గర్భిణులు ప్రసవమ య్యేవరకు సంబంధింత పీహెచ్‌సీ వైద్యాధికారి, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టిసారించా లన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సంభవించిన మాతా శివు మరణాలపై బుధవారం కలెక్టరేట్‌లో పీహెచ్‌సీల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గర్భిణీకి ఒక రికార్డు నిర్వహించాలని, కుటుంబ చరిత్రను ముందే తెలుసుకుని జన్యుపరమైన వ్యాధులకు వైద్యం అందించాలని సూచించారు. మాతా శిశు మరణాల నివారణకు గైనకాలజిస్ట్, పిడియాట్రిషి యన్లతో మెడికల్ ఆఫీసర్లు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లకు శిక్షణ ఇప్పించాలని, డిజిటల్ మీడియా ద్వారా గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో మలేరియా కేసులు నమోదు కాకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో భాస్కరరావు, డీసీహెచ్‌ఎస్ బి.వాగ్దేవి, ప్రోగ్రాం అధికారి జగన్మోహన్‌రావు, డీఎల్‌ఏటీవో వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 05 , 2025 | 11:36 PM