రూ.371 కోట్లతో ఉపాధి పనులు
ABN, Publish Date - Mar 06 , 2025 | 12:18 AM
జిల్లాలో ఈ ఏడాది ఉపాధిహామీ పథకం కింద రూ.371 కోట్లతో పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.శారదాదేవి తెలిపారు.బుధవారం రామభద్రపురంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 54,714 పనులు మంజూరు చేశామని, రూ.5 లక్షల 94 వేల మంది వేతనదారులు పనులు చేస్తున్నారని చెప్పారు.
రామభద్రపురం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ ఏడాది ఉపాధిహామీ పథకం కింద రూ.371 కోట్లతో పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.శారదాదేవి తెలిపారు.బుధవారం రామభద్రపురంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 54,714 పనులు మంజూరు చేశామని, రూ.5 లక్షల 94 వేల మంది వేతనదారులు పనులు చేస్తున్నారని చెప్పారు. మ్యాచింగ్ గ్రాంటు కింద మరో రూ.247 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది వ్యవసాయ అనుబంధ పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, రైతులకు ఉపయోగపడే పనులు చేపడు తున్నామని చెప్పారు. ప్రతి పంచాయతీకి 25 చొప్పున ఈ ఏడాది 14వేల ఫారంఫాం డ్స్ మంజూరుచేశామని తెలిపారు. వీటితోపాటు రింగ్ ట్రెంచ్‌లు కూడా మంజూరు చేశామని, ఈపనులన్నీ జూన్ నెలాఖరులోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా మని చెప్పారు. అమృత సరోవర్ కింద పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ ఏడాది ఐదు వేల ఎకరాల్లో హార్టికల్చర్ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. బొబ్బిలి వీణలను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో పనస చెట్లు పెంచడానికి ప్రాధా న్యత ఇస్తున్నామని, ఇందులోభాగంగా రైతులకు ఉచితంగా పనస మొక్కల పెంపకా నికి అందిస్తున్నామని తెలిపారు. సోషల్ ఆడిట్‌లో వచ్చిన ఫిర్యాదులపై కూడా చర్య లు తీసుకొని అవకతవలకు పాల్పడిన సిబ్బంది నుంచి డబ్బులు రికవరీ చేస్తున్నామని తెలిపారు. ముచ్చర్లవలసలో గోకులాల షెడ్లను పరిశీలించారు. అనం తరం బాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాల ఉపాధిహామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్షించారు. కార్యక్రమంలో రామభద్రపురం ఏపీవో త్రినాథరావు పాల్గొన్నారు.
Updated Date - Mar 06 , 2025 | 12:18 AM