విద్యార్థిని మృతి
ABN, Publish Date - Feb 11 , 2025 | 12:24 AM
కురుపాం మండలంలోని లంకాజోడు గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని పువ్వల వాసవి(15) తన స్వగ్రామం అయిన జి.శివడలో పురుగు మందు తాగి మృతి చెందింది.
గుమ్మలక్ష్మీపురం/ కురుపాం రూరల్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): కురుపాం మండలంలోని లంకాజోడు గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని పువ్వల వాసవి(15) తన స్వగ్రామం అయిన జి.శివడలో పురుగు మందు తాగి మృతి చెందింది. నీలకంఠాపురం ఎస్‌ఐ నీలకంఠరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లంకాజోడు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న వాసవి తల్లిదండ్రులు కొన్నేళ్ల కిందట చనిపో యారు. తమ బంధువులైన తోయక కూర్మారావు చిన్నప్పటి నుంచి పెంచుతున్నారు. రెండు రోజులు సెలవులు కావడంతో వసవి పాఠశాల నుంచి స్వగ్రామమైన జి.శివడ వచ్చింది. పంట పొలంకు వేసిన పురుగులు మందు ఇంటి వద్ద ఉంటే కూల్ డ్రింక్ అనుకునిని తాగినట్టు సంరక్షకుడు కూర్మారావు తెలిపారు. వెంటనే వాంతులు అవ్వడంతో స్థానిక మొండెంఖల్ ఆసుపత్రికి తీసుకు వెళ్లా రు. ప్రథమ చికిత్స అనంతరం గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - Feb 11 , 2025 | 12:25 AM