ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెరువులో యువకుడి మృతదేహం

ABN, Publish Date - Jan 31 , 2025 | 12:27 AM

స్థానిక జాతీయ రహదారి అనుకుని ఉన్న గంగిరావి చెరువులో గురువారం తేలిన మృతదేహం భోగాపురానికి చెందిన యువకుడు పసుపులేటి వెంకటేష్‌(24)గా గుర్తించామని ఎస్‌ఐ వి. పాపారావు తెలిపారు.

భోగాపురం, జనవరి30(ఆంధ్రజ్యోతి): స్థానిక జాతీయ రహదారి అనుకుని ఉన్న గంగిరావి చెరువులో గురువారం తేలిన మృతదేహం భోగాపురానికి చెందిన యువకుడు పసుపులేటి వెంకటేష్‌(24)గా గుర్తించామని ఎస్‌ఐ వి. పాపారావు తెలిపారు. ఇందుకు సంబంఽధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురానికి చెందిన పసుపులేటి సూరిబాబుకు ఇద్దరు కుమారులు. ఇటీవల పెద్దకుమారుడు హైదరాబాద్‌ వెళ్లి పోయాడు. చిన్న కుమారుడు పసుపులేటి వెంకటేష్‌ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం, కూలి పనులు చే స్తుండేవాడు. అయితే ఈనెల 23న మధ్యాహ్నం బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు మణి మ్మ, సూరిబాబు గ్రామంలో స్నేహితులు, బంధువుల ఇళల్ల్లో వెతికారు. అయి తే గురువారం ఉదయం గంగిరావి చెరువులో మృతదేహం తేలి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం గుర్తు పట్టలేని రీతిలో ఉంది. ఎట్టకేలకు తల్లిదండ్రులు మృతదేహాన్ని గుర్తించి బోరు మన్నారు. మృతుడు తండ్రి సూరిబాబు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ పాపారావు తెలిపారు.

Updated Date - Jan 31 , 2025 | 12:27 AM