ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cooperative Societies సహకార సంఘాల ద్వారా మెరుగైన సేవలు

ABN, Publish Date - Feb 17 , 2025 | 11:37 PM

Better Services Through Cooperative Societies సహకార సంఘాల ద్వారా మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం నిర్వహ ణపై సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): సహకార సంఘాల ద్వారా మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం నిర్వహ ణపై సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాదిని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలో పాథమిక సహకార సంఘాలను బలోపేతం చేయాలని, వాటికి గ్రేడింగ్‌ ఇవ్వాలని సూచించారు. వాటి వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించాలని తెలిపారు. జిల్లా సహకార అధికారి పి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ.. ఈ నెలలో పీఏసీఎస్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారులకు శిక్షణ తరగతులు, పరిసరాల పరిశుభ్రత, సభ్యత్వ నమోదు చేపడతా మన్నారు. మార్చి నుంచి డిసెంబరు వరకు పలు కార్యక్రమాలు, సదస్సులు నిర్వహి స్తామన్నారు. రైతులకు తక్కువ వడ్డీకిరుణాలు, అందుబాటు ధరల్లో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందిస్తామని, డిపాజిట్లు సేకరణ చేపడతామని తెలిపారు. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు, గ్రామాల దత్తత, గిడ్డంగుల నిర్మాణం, పాడి పరిశ్రమ ఏర్పాటు, పాలకవర్గాల పాత్రపై అవగాహన , చెరువులు, రిజర్వాయర్లలో చేపల పెంపకం, చేనేత, మత్స్య సహకార సంఘాల కోసం జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి దినేష్‌కుమార్‌రెడ్డి, విజయనగరం, శ్రీకాకుళం డీసీసీబీల జీఎంలు తదితరులు పాల్గొన్నారు.

జీబీఎస్‌పై అప్రమత్తం

గులియన్‌ బారీ సిండ్రోమ్‌ (జీబీఎస్‌)పై వైద్య , పంచాయతీరాజ్‌ శాఖలు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ.. జీబీఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వేడినీరు, తాజా ఆహార పదార్థాలు తీసుకునేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు పారిశుధ్యం మెరుగుపర్చాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గృహ నిర్మాణ పనులు , బలిజిపేట, సాలూరు మండలాల్లో ఎంఎస్‌ఎంఈ సర్వే జాప్యంపై అధికారులను ప్రశ్నించారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పి.ధర్మచంద్రారెడ్డి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:37 PM