ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Celebrations శుభకార్యాలకు వేళాయే..

ABN, Publish Date - Jan 28 , 2025 | 11:30 PM

Auspicious Time for Celebrations శుభ కార్యాలకు వేళయ్యింది. ఈ నెల 30 నుంచి మాఘమాసం ప్రారంభం కానుంది. మార్చి 16 వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర శుభ కార్యాలు ఊపందు కోనున్నాయి.

ముందస్తు ఏర్పాట్లలో జిల్లావాసులు

పాలకొండ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): శుభ కార్యాలకు వేళయ్యింది. ఈ నెల 30 నుంచి మాఘమాసం ప్రారంభం కానుంది. మార్చి 16 వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర శుభ కార్యాలు ఊపందు కోనున్నాయి. ఫిబ్రవరిలో 2, 3, 7, 13, 14, 15, 18, 19, 20, 21, 23, 25 , మార్చిలో 1, 2, 6, 7, 12 , ఏప్రిల్‌లో 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 , జూన్‌ 1, 2, 4, 7 తేదీల్లో శుభకార్యాలకు అనుకూలమని పండితులు చెబుతున్నారు. కాగా వివాహాలు చేయదలిచిన వారు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పురోహితులు, కల్యాణ మండపాలు, డెకరేషన్‌, వంట పనివారు, వీడియో, ఫొటో గ్రాఫర్లు, బాజాభంత్రీల వారిని బుక్‌ చేసుకున్నారు. ముందుస్తుగా అడ్వాన్సులు కూడా చెల్లించారు. శుభముహూర్తాల సందర్భంగా మరోవైపు వ్యాపారాలు కూడా జోరందు కున్నాయి. పలు వర్గాల వారికి చేతి పండా పని దొరికింది. మొత్తంగా అంతటా సందడి వాతావరణం నెలకొంది.

అన్నీ మంచి ముహూర్తాలే..

ఉత్తరాయణంలో శుభముహూర్తాలు అధికంగా ఉంటాయి. అందులో మాఘం, ఫల్గుణం, చై త్రం, వైశాఖం, జ్యేష్టం మాసాల్లో శుభ ముమూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, దేవతా మూర్తుల ప్రతిష్ఠలు చేసుకోవచ్చు.

- డి.లక్ష్మీ ప్రసాదశర్మ, కోటదుర్గమ్మ ఆలయ ప్రధాన అర్చకుడు

Updated Date - Jan 28 , 2025 | 11:30 PM