ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Elephants అమ్మో.. ఏనుగులు

ABN, Publish Date - Feb 12 , 2025 | 12:06 AM

ammo.. Elephants మండలంలోని సుంకి గ్రామంలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. మంగళవారం ఆ ప్రాంతవాసులను బెంబేలెత్తించాయి. సుంకి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న పౌర సరఫరాల గోడౌన్‌ ప్రాంతంలో అవి హల్‌చల్‌ చేశాయి. దీంతో అక్కడున్న సిబ్బంది భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టారు.

పిట్టలమెట్ట సమీపంలో సంచరిస్తున్న గజరాజుల గుంపు

లారీ అద్దం, బియ్యం బస్తాలు ధ్వంసం

పరుగులు తీసిన సిబ్బంది

గరుగుబిల్లి,ఫిబ్రవరి11(ఆంధ్రజ్యోతి): మండలంలోని సుంకి గ్రామంలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. మంగళవారం ఆ ప్రాంతవాసులను బెంబేలెత్తించాయి. సుంకి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న పౌర సరఫరాల గోడౌన్‌ ప్రాంతంలో అవి హల్‌చల్‌ చేశాయి. దీంతో అక్కడున్న సిబ్బంది భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. కాగా ఆ ప్రాంతం లో బియ్యం లోడ్‌తో ఉన్న లారీపై గజరాజులు దాడి చేశాయి. వాహనం అద్దాలు, బియ్యం బస్తాలను ధ్వంసం చేశాయి. గోడౌన్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, ఆ మార్గంలోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. అయితే ఎవరికీ ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఏనుగులు గోడౌన్‌ నుంచి నాగావళి నది మార్గాన పిట్టలమెట్ట ప్రాంతానికి చేరుకున్నాయి. సుంకిలో వరి నారుమడితో పాటు పలువురు రైతులకు చెందిన పంటలను ధ్వంసం చేశాయి. ప్రాణనష్టం సంభవించకముందే అటవీశాఖాధికారులు స్పందించి ఏనుగులను తరలించే చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Feb 12 , 2025 | 12:06 AM