అరకు అభివృద్ధికి కృషి చేయండి
ABN, Publish Date - Feb 10 , 2025 | 11:49 PM
ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన అరకులోయను మరింత అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్‌ను ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ సీవేరి దొన్నుదొర కోరారు.
పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్‌ను కోరిన దొన్నుదొర
అనంతగిరి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన అరకులోయను మరింత అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్‌ను ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ సీవేరి దొన్నుదొర కోరారు. ఈ మేరకు సోమవారం ఆయనను ఏలూరులో కలిశారు. ఇటీవల అరకు ఉత్సవ్‌తో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేస్తూ నిర్వహించినట్టు తెలిపారు. దీని వల్ల పర్యాటకంగా మరింత గుర్తింపు లభించిందన్నారు. పారా గ్లైడింగ్, హెలికాప్టర్, హాట్ ఎయిర్ బెలూన్ తదితర వాటి గురించి వివరించారు. అలాగే పౌరసరఫరాలశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.
Updated Date - Feb 10 , 2025 | 11:49 PM