ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన వైసీపీ ఉల్లంఘన

ABN, Publish Date - Feb 01 , 2025 | 01:22 AM

అధికారంలో వున్నప్పుడు వైసీపీ నాయకులు ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో.. అధికారాన్ని కోల్పోయిన తరువాత కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను ఉల్లంఘించి పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో వున్నందున అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించకూడదని అధికారులు చెప్పినా పట్టించుకోలేదు. సుమారు రెండు గంటలపాటు సమావేశాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

వైసీపీ నేతలతో మాట్లాడడానికి వచ్చిన అధికారులు (కుడివైపున)

నియమావళికి విరుద్ధంగా పార్లమెంటరీ స్థాయి సమావేశం

అధికారులు అభ్యంతరం చెప్పినా బేఖాతరు

రెండు గంటలపాటు సాగిన సమావేశం

దారికి ఇరువైపులా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు

కశింకోట, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): అధికారంలో వున్నప్పుడు వైసీపీ నాయకులు ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో.. అధికారాన్ని కోల్పోయిన తరువాత కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను ఉల్లంఘించి పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో వున్నందున అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించకూడదని అధికారులు చెప్పినా పట్టించుకోలేదు. సుమారు రెండు గంటలపాటు సమావేశాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

వైసీపీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం స్థాయి సమావేశాన్ని శుక్రవారం కశింకోటలోని ఒక ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేశారు. దీనికి సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు, నియోజకవర్గం ఇన్‌చార్జి కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి అమర్‌, మాజీ ఎమ్మెల్యే, ఇతర నాయకులు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. ప్రధాన రహదారి నుంచి సమావేశం జరిగే ఫంక్షన్‌ హాలు వరకు అడుగడుగునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే వున్నప్పటికీ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్‌ వెలువడింది. ఆ క్షణం నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పారీలు, నాయకుల ఫ్లెక్సీలు వుండకూదని, నేతల విగ్రహాలకు ముసుగులు వేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. సభలు, సమావేశాలు, ర్యాలీలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి. అయితే వైసీపీ నాయకులు ఎటువంటి అనుమతులు లేకుండా పార్లమెంటరీ స్థాయి సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను ఉల్లంఘించారు. వైసీపీ సమావేశం గురించి తెలుసుకున్న తహసీల్దారు ఎ.శ్రీనివాసరావు, ఎంపీడీవో రవికుమార్‌, సీఐ అల్లు స్వామినాయుడు, పంచాయతీ కార్యదర్శి రామచంద్రరావు అక్కడకు వెళ్లి... అనుమతి లేకుండా సమావేశం నిర్వహించకూడదని చెప్పారు. కానీ వైసీపీ నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు తమకు కూడా తెలుసుని, సమావేశాలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. అధికారులు ఎంత సర్దిచెప్పినప్పటికీ వైసీపీ నేతలు వినలేదు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెనుతిరిగారు. తరువాత సుమారు రెండు గంటలపాటు సమావేశం జరిగింది.

Updated Date - Feb 01 , 2025 | 01:22 AM