ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర

ABN, Publish Date - Feb 15 , 2025 | 12:56 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహణకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు.

  • ప్రతి ప్రభుత్వ కార్యాలయం, పరిసరాల్లో పరిశుభ్రత చర్యలు

  • విద్యా సంస్థల్లో కూడా...

  • ఇప్పటికే రెండో స్థానంలో విశాఖ

  • 14 అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఎంపిక

  • మొదటి స్థానం కోసం కసరత్తు

విశాఖపట్నం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహణకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి నెలా మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడమే దీని లక్ష్యం. ఇందులో ప్రతి పౌరుడు భాగస్వామి అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే. అది మాత్రమే కాకుండా ప్రతి ప్రభుత్వ కార్యాలయం అందంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దాల్సి ఉంది. ఫైళ్లను, ఫర్నీచర్‌ను క్రమ పద్ధతిలో ఉంచుకోవడం, ప్రజల రాకపోకలు సాగించే ప్రాంతాల్లో అడ్డంకులు లేకుండా చేయడం వంటివి అందులో భాగం. నెలకో అంశాన్ని ఽథీమ్‌గా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

గత జనవరిలో ‘న్యూ ఇయర్‌...క్లీన్‌ స్టార్ట్‌’ అని అమలు చేశారు. ఇప్పుడు ఫిబ్రవరిలో ‘మన మూలాలు..మన బలాలు’ అనే అంశాన్ని తీసుకున్నారు. మన చరిత్ర ఏమిటి?, వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది దీని ఉద్దేశం. కాలుష్యం లేని పర్యావరణం, ఘన వ్యర్థాల సక్రమ నిర్వహణ, స్వచ్ఛమైన నీటి వనరులు, ఇళ్లు, అపార్టుమెంట్లు, కాలనీ, గ్రామాలు అన్నీ పరిశుభ్రంగా ఉండేలా అక్కడి వారిని భాగస్వాముల్ని చేయాలి. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గుడులు, గోపురాలు, చర్చిలు, మసీదులు, పరిశ్రమల్లోను దీనిని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గాలిలో కాలుష్యం లేకుండా చూడాల్సిన బాధ్యత కాలుష్య నియంత్రణ మండలి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఎక్కడకు వెళ్లినా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనేది ఆశయం.

రెండో స్థానంలో విశాఖ జిల్లా

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అమలు విషయంలో పట్టణాభివృద్ధి శాఖ నిర్దేశించిన ప్రమాణాలు పాటించిన వారికి ప్రభుత్వం ర్యాంకులు ప్రకటిస్తూ వస్తోంది. ఇందులో ఎన్‌టీఆర్‌ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, విశాఖ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకులకు 14 అంశాలను పరిశీలిస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ప్రజా మరుగుదొడ్లు, ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడం, ఘన వ్యర్థాల నిర్వహణ వంటివి అందులో ఉన్నాయి. మొత్తం 200 పాయింట్లకుగాను ఎన్‌టీఆర్‌ జిల్లా 127 పాయింట్లతో మొదటి స్థానంలో, 122 పాయింట్లతో విశాఖ రెండో స్థానంలో నిలిచాయి. ఈసారి విశాఖ జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు ఇక్కడి అధికారులు యత్నిస్తున్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:56 AM