మన్యం బంద్‌కు సమాయత్తం
ABN, Publish Date - Feb 09 , 2025 | 12:35 AM
గిరిజన ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి 1/70 చట్టం కారణంగా విఘాతం ఏర్పడుతున్నదని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గిరిజన ప్రాంతంలో ఉద్యమం ఉధృతమవుతున్నది. ఇప్పటికే ఈ నెల 11, 12 తేదీల్లో ఏజెన్సీ వ్యాప్త బంద్‌కు అఖిల పక్షం పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి పోస్టర్ల ఆవిష్కరణ ప్రక్రియ సైతం శనివారం నిర్వహించారు. అలాగే వారపు సంతల్లో, గిరిజన పల్లెల్లో సైతం 48 గంటల బంద్‌ను విజయవంతం చేయాలని గిరిజన సంఘాలు, అఖిల పక్షం ప్రతినిధులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
- 11, 12 తేదీల్లో విజయవంతంగా నిర్వహించేందుకు అఖిలపక్షం కసరత్తు
- పోస్టర్ల ఆవిష్కరణ... ముమ్మరంగా గ్రామాల్లో ప్రచారం
- స్పీకర్ అయ్యన్నపాత్రుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్
పాడేరు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి 1/70 చట్టం కారణంగా విఘాతం ఏర్పడుతున్నదని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గిరిజన ప్రాంతంలో ఉద్యమం ఉధృతమవుతున్నది. ఇప్పటికే ఈ నెల 11, 12 తేదీల్లో ఏజెన్సీ వ్యాప్త బంద్‌కు అఖిల పక్షం పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి పోస్టర్ల ఆవిష్కరణ ప్రక్రియ సైతం శనివారం నిర్వహించారు. అలాగే వారపు సంతల్లో, గిరిజన పల్లెల్లో సైతం 48 గంటల బంద్‌ను విజయవంతం చేయాలని గిరిజన సంఘాలు, అఖిల పక్షం ప్రతినిధులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే స్పీకర్ 1/70 చట్టంపై చేసిన వ్యాఖ్యలపై ఆ తరువాత ఆయన గాని, టీడీపీ అధిష్ఠానం గాని స్పందించకపోవడంపై గిరిజనులు మండిపడుతున్నారు. ఆయన గిరిజనులకు క్షమాపణలు చెప్పాలని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే 48 గంటల బంద్ అనంతరం తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్షం పేర్కొంటున్నది.
Updated Date - Feb 09 , 2025 | 12:35 AM