ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

600 కిలోల గంజాయి పట్టివేత

ABN, Publish Date - Feb 22 , 2025 | 12:24 AM

స్థానిక పోలీసులు భారీ మొత్తంలో గంజాయి పట్టుకున్నారు. మండలంలోని గోపాలపట్నం సమీపంలో సూదికొండ వద్ద గంజాయి నిల్వ చేసినట్టు సమాచారం అందుకున్న సీఐ జి.అప్పన్న.. సిబ్బందితో వెళ్లి సుమారు 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఎస్పీ తుహిన్‌ సిన్హా శుక్రవారం సాయంత్రం ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ మీడియాకు వెల్లడించారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి, నిందితులతో ఎస్పీ తుహిన్‌ సిన్హా, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ, పోలీసులు

ఎనిమిది మంది అరెస్టు

కారు, రెండు బైక్‌లు సీజ్‌

మరో ఇద్దరి కోసం గాలింపు

ప్రధాన నిందితుడు గుంటపల్లికి చెందిన పాత నేరస్థుడిగా గుర్తింపు

ఏజెన్సీలో కొనుగోలు చేసి. గోపాలపట్నం సమీపంలోని నిల్వ

ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలింపు

పక్కా సమాచారంతో ‘పేట పోలీసులు దాడి

పాయకరావుపేట, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): స్థానిక పోలీసులు భారీ మొత్తంలో గంజాయి పట్టుకున్నారు. మండలంలోని గోపాలపట్నం సమీపంలో సూదికొండ వద్ద గంజాయి నిల్వ చేసినట్టు సమాచారం అందుకున్న సీఐ జి.అప్పన్న.. సిబ్బందితో వెళ్లి సుమారు 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఎస్పీ తుహిన్‌ సిన్హా శుక్రవారం సాయంత్రం ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ మీడియాకు వెల్లడించారు.

పాయరావుపేట మండలం గుంటపల్లికి చెందిన ఒక వ్యక్తి అల్లూరి సీతారాజు జిల్లా ఏజెన్సీ నుంచి గంజాయి కొనుగోలు చేసి, ఇక్కడకు తీసుకుని ఇతర రాష్ట్రాల్లోని గంజాయి వ్యాపారులకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఒడిశా సరిహద్దులోని ఒక గ్రామంలో 600 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. దీనిని పాయకరావుపేట మండలం గోపాలపట్నం సమీపంలోని సూదికొండ వద్దకు చేర్చడానికి జీకే వీధి మండలం మొండిగెడ్డ గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. అతను మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో బొలేరో వాహనంలో గంజాయిని పాయకరావుపేట మండలం గోపాలపట్నం సమీపంలోని సూదికొండ వద్దకు చేర్చారు. అనంతరం బొలేరో వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక సీఐ జి.అప్పన్న, సిబ్బందితో వెళ్లిదాడి చేశారు. 17 గోనె సంచుల్లో ప్యాకింగ్‌ చేసిన గంజాయిని స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు గంజాయి, ఒక కారు, రెండు బైక్‌లను స్టేషన్‌కు తరలించారు. వీరు ఇచ్చిన సమాచారంతో పీఎల్‌.పురం జంక్షన్‌ వద్ద ఒక హోటల్‌లో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని తూకం వేసి 600 కిలోలు వున్నట్టు నిర్ధారించారు. ప్రధాన నిందితుడైన గుంటపల్లికి చెందిన వ్యక్తిపై ఇప్పటికే ఆరు గంజాయి కేసులు వున్నాయి. దీంతో అతనిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని ఎస్పీ చెప్పారు. ఇతను గతంలో గంజాయి కేసులకు సంబంధించి జైలులో రిమాండ్‌ ఖైదీగా వున్నప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన గంజాయి నిందితులతో పరిచయం ఏర్పరచుకుని, బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత గంజాయి సరఫరా చేస్తున్నాడని తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఏజెన్సీ నుంచి గంజాయిని బొలేరో వాహనంలో ఇక్కడకు తీసుకువచ్చిన ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు చర్యలుచేపట్టామని చెప్పారు. గంజాయితోపాటు పట్టుకున్న నిందితుల్లో ముగ్గురు గుంటపల్లి, ఒకరు కాకినాడ, మరొకరు నర్సీపట్నంకాగా, హోటల్‌ వద్ద పట్టుకున్న ముగ్గురు ఏజెన్సీకి చెందిన వారని ఎస్పీ తెలిపారు. భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్న సీఐ జి.అప్పన్న, ఎస్‌ఐ పురుషోత్తం, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2025 | 12:24 AM