ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రంగురాళ్ల తవ్వకాలకు పావులు

ABN, Publish Date - Feb 06 , 2025 | 01:25 AM

గొలుగొండ మండల కరక అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలకు బడాబాబులు పావులు కదుపుతున్నారు. ఎప్పుడో పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం చేసుకున్న దరఖాస్తులు ఇప్పటికీ మైనింగ్‌ శాఖ వద్ద సజీవంగానే ఉన్నాయి. ఆ దరఖాస్తుదారుల్లో కొంతమంది ఇప్పుడు రంగు రాళ్ల తవ్వకాలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. వాస్తవంగా రంగురాళ్ల తవ్వకాలకు అనుమతులు కోసం మైనింగ్‌ శాఖకు అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి రెవెన్యూ, అటవీశాఖ ఉన్నతాధికారులకు పంపుతారు.

గొలుగొండ మండలం కరక రిజర్వు ఫారెస్టు (ఫైల్‌ ఫొటో)

తెరవెనుక బడాబాబులు

పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం దరఖాస్తులు ఇప్పటికీ లైవ్‌లోనే

తాజాగా మైనింగ్‌ సిబ్బందితో కలిసి కరక రిజర్వు ఫారెస్టులో పరిశీలన

మైనింగ్‌ శాఖ ఓఎస్‌డీ ఆదేశాలతోనే పంపామంటున్న ఏడీ

నర్సీపట్నం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండల కరక అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలకు బడాబాబులు పావులు కదుపుతున్నారు. ఎప్పుడో పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం చేసుకున్న దరఖాస్తులు ఇప్పటికీ మైనింగ్‌ శాఖ వద్ద సజీవంగానే ఉన్నాయి. ఆ దరఖాస్తుదారుల్లో కొంతమంది ఇప్పుడు రంగు రాళ్ల తవ్వకాలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. వాస్తవంగా రంగురాళ్ల తవ్వకాలకు అనుమతులు కోసం మైనింగ్‌ శాఖకు అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి రెవెన్యూ, అటవీశాఖ ఉన్నతాధికారులకు పంపుతారు. ఈ మూడు శాఖలు సంయుక్తంగా సర్వే చేసిన తర్వాత నిబంధనలకు లోబడి అనుమతులు ఇస్తారు. లేకపోతే దరఖాస్తులను తిరస్కరిస్తారు. అయితే రంగురాళ్ల తవ్వకాల కోసం పదేళ్ల క్రితం చేసుకున్న దరఖాస్తులు మైనింగ్‌ శాఖ వద్ద ఇప్పటికీ లైవ్‌లో వుండడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీ సాయంత్రం మైనింగ్‌ రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ సత్యమూర్తి.. నలుగురు సిబ్బందిని, ఇద్దరు రంగురాళ్ల వ్యాపారులను వెంటపెట్టుకొని కరక కొండ ఎక్కిన విషయం తెలిసిందే. అమరావతిలో మైనింగ్‌ శాఖ ఓఎస్‌డీ ఆదేశాలతోనే రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ని, సిబ్బందిని సర్వేకి పంపామని మైనింగ్‌ ఏడీ చెప్పడం గమనార్హం. అమరావతి స్థాయిలో పావులు కదుపుతున్నారంటే రంగురాళ్ల తవ్వకాలకు పెద్ద స్థాయిలోనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

రంగురాళ్ల తవ్వకాలకు లైవ్‌లో వున్న దరఖాస్తులు

అవ్య మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ సంస్థ 2014లో వేర్వేరు తేదీల్లో పెట్టుకున్న నాలుగు దరఖాస్తులు మైనింగ్‌ శాఖలో ఉన్నాయి. గొలుగొండ మండలం కరకలో సర్వే నంబరు 195లో 20 ఎకరాలు, కరక రిజర్వ్‌ ఫారెస్టులో ఒక్కోచోట 20 ఎకరాలు చొప్పున 60 ఎకరాలు.. మొత్తం 80 ఎకరాల్లో తవ్వకాలకు వేర్వేరుగా దరఖాస్తులు ఇచ్చారు.

కరకలో సర్వే నంబరు 193లో రెండు ఎకరాలు, సర్వే నంబరు 1193లో నాలుగు ఎకరాల్లో రంగురాళ్ల తవ్వకాలకు ఈస్ట్రన్‌ ఘాట్స్‌ అండ్‌ ట్రైబ్స్‌ సంస్థ 2005, 2011 సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకుంది.

గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం సర్వే నంబరు 55-56లో 21.89 ఎకరాల్లో రంగురాళ్ల తవ్వకాలకు పి.శ్రీనివాసరావు 2013లో దరఖాస్తు చేసుకున్నారు.

పప్పుశెట్టిపాలెంలో సర్వే నంబరు 73లో 4.58 ఎకరాల్లో రంగురాళ్ల తవ్వకాలకు కె.కొండలరావు అనే వ్యక్తి 2008లో దరఖాస్తు చేసుకున్నారు.

కరక రిజర్వ్‌ ఫారెస్టులో వేర్వేరకుగా 12.4 ఎకరాలు, 3.15 ఎకరాల్లో రంగురాళ్ల తవ్వకాలకు ఆర్వీ రమణ 2011, 2014 సంవత్సరాల్లో రంగురాళ్ల తవ్వకాలకు దరఖాస్తు చేసుకున్నారు.

కరక రిజర్వ్‌ఫారెస్టులో 20 ఎకరాల చొప్పున మొత్తం 60 ఎకరాల్లో రంగురాళ్ల తవ్వకాలకు పి.శశిప్రభ, చిటికెల వెంకటరమణ, పి.చిరంజీవిరాజు వేర్వేరుగా దరఖాస్తు పెట్టుకున్నారు.

గొలుగొండ మండలం జమ్మవరం సర్వే నంబరు 1/1, 1/2 లో 3.93 ఎకరాల్లో రంగురాళ్ల తవ్వకాల కోసం టి.చిన్నారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

Updated Date - Feb 06 , 2025 | 01:25 AM