ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేటి నుంచి పీ4 సర్వే

ABN, Publish Date - Mar 08 , 2025 | 12:36 AM

పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో పీ4 సర్వే ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా రానున్న ఐదేళ్లలో పేదరిక నిర్మూలనకు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దిశానిర్దేశంగా నిలిచిన ‘ఫ్రేమ్‌ వర్క్‌’లో జీరో పావర్టీ పీ4 పాలసీ అత్యంత ప్రాధాన్యత అంశగా పరిగణించి ఈ సర్వేకు శ్రీకారం చుట్టింది. పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడం, జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో వున్న 20 శాతం మంది పేదలను గుర్తించడం ద్వారా పేదరికాన్ని దూరం చేయాలన్నది పీ4 సర్వే ఉద్దేశం.

పేదరికం లేని సమాజ స్థాపనే ధ్యేయం!

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా ఇంటింటా సమాచారం సేకరణ

రంగంలోకి గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బంది

28వ తేదీలోగా పూర్తి

అనకాపల్లి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో పీ4 సర్వే ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా రానున్న ఐదేళ్లలో పేదరిక నిర్మూలనకు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దిశానిర్దేశంగా నిలిచిన ‘ఫ్రేమ్‌ వర్క్‌’లో జీరో పావర్టీ పీ4 పాలసీ అత్యంత ప్రాధాన్యత అంశగా పరిగణించి ఈ సర్వేకు శ్రీకారం చుట్టింది. పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడం, జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో వున్న 20 శాతం మంది పేదలను గుర్తించడం ద్వారా పేదరికాన్ని దూరం చేయాలన్నది పీ4 సర్వే ఉద్దేశం. జిల్లాలో 552 గ్రామ/ వార్డు సచివాలయా సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరగనుందని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ వెల్లడించారు. ఇంటింటా సర్వే చేయడం ద్వారా పేదల అవసరాలను గుర్తించి వారి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నారు. సర్వే సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 27 రకాల ప్రశ్నలకు సమాధానం చెప్పించడం ద్వారా పేదరికంలో ఎంతమంది ఉన్నారనే దానిపై ఒక అంచనా వేయనున్నారు. సిబ్బంది సేకరించిన సమాచారాన్ని ప్రత్యేక యాప్‌లో పొందుపరచనున్నారు. ఎంపీడీఓలు, మునిసిపల్‌ కమిషనర్లు, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఈ సర్వే నిర్వహించనున్నారు. అయితే ప్రభుత్వ పథకాల అమలు, అనర్హుల తొలగింపు వంటి అంశాలతో ఈ సర్వేతో ఎటువంటి సంబంధం ఉండదని, ప్రతిఒక్కరూ సర్వే బృందానికి సమాచారం అందించి సహకరించాలని జిల్లా అధికారులు కోరుతున్నారు.

Updated Date - Mar 08 , 2025 | 12:36 AM