గాజువాకలో వ్యక్తి ఆత్మహత్య
ABN, Publish Date - Feb 16 , 2025 | 12:52 AM
తనను విడిచిపెట్టి భార్య దూరంగా ఉంటుండడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గాజువాకలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
గాజువాక, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): తనను విడిచిపెట్టి భార్య దూరంగా ఉంటుండడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గాజువాకలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చైన్‌పాల్‌సింగ్ గాజువాకలోని ఓ అపార్ట్‌మెంటులోని ఫ్లాట్‌లో ఇద్దరు స్నేహితులతో కలిసి నివాసం ఉంటూ భెల్ హెచ్‌పీవీపీలోని ఓ సంస్థలో కుక్‌గా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం చైన్‌పాల్‌సింగ్‌ను భార్య విడిచిపెట్టింది. దీంతో మనస్తాపానికి గురై ఫ్లాట్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ హూక్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Feb 16 , 2025 | 12:52 AM