ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గిరిజన చట్టాలకు సంపూర్ణ రక్షణ కల్పించేది టీడీపీయే

ABN, Publish Date - Feb 12 , 2025 | 12:37 AM

రాష్ట్రంలో గిరిజన చట్టాలకు సంపూర్ణ రక్షణ కల్పించేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆ పార్టీ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. సోమవారం ఆమె కుమ్మరిపుట్టులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నాయకులు వారి ఉనికిని కాపాడుకొనేందుకు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను చేస్తూ అమాయక ఆదివాసీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి

- మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

- వైసీపీ హయాంలో జీవో నంబరు 3ను రద్దు చేస్తే ఆ పార్టీ నాయకులు ఏం చేశారని నిలదీత

పాడేరురూరల్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గిరిజన చట్టాలకు సంపూర్ణ రక్షణ కల్పించేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆ పార్టీ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. సోమవారం ఆమె కుమ్మరిపుట్టులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నాయకులు వారి ఉనికిని కాపాడుకొనేందుకు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను చేస్తూ అమాయక ఆదివాసీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జీవో నంబరు 3ను రద్దు చేస్తే వైసీపీ నాయకులు అప్పుడు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. గిరిజనులను ఉద్ధరిస్తారని నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి ఏడు నెలలు అయినా అసెంబ్లీకి వెళ్లని విశ్వేశ్వరరాజు ప్రజల్లో ఉనికి కోసం తప్పుడు ప్రచారాలను చేస్తూ కాలం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. గిరిజనుల మనోభావాలను గౌరవిస్తూ అభివృద్ధి చేసే సత్తా కూటమి ప్రభుత్వానికే ఉందన్నారు. వైసీపీ నాయకుల తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆమె కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ ఎస్‌వీ రమణమూర్తి, కూడి రామునాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 12:37 AM