ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆన్‌లైన్‌లో ఇంటర్‌ హాల్‌ టికెట్లు

ABN, Publish Date - Feb 01 , 2025 | 12:56 AM

ఇంటర్‌ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులంతా ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది.

ఫిబ్రవరి రెండో వారం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం

మద్దిలపాలెం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):

ఇంటర్‌ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులంతా ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. గతంలోలా హాల్‌టికెట్ల కోసం కళాశాలల చుటూ తిరగాల్సిన పనిలేదని వివరించింది. ఈ మేరకు వెబ్‌సైట్‌ ఛజ్ఛ్చీఞ.ఛిౌఝ నుంచి విద్యార్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఒకేషనల్‌, పదో తేదీ నుంచి జనరల్‌ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థుల హాల్‌టికెట్లను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మార్చి ఒకటో తేదీ నుంచి థియరీ పరీక్షలున్నందున ఈ నెల రెండో వారం నుంచి ఆయా పరీక్షల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు. పరీక్ష ఫీజు చెల్లించిన ప్రతి విద్యార్థి హాల్‌టికెట్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని తెలిపింది. గతంలో హాల్‌టికెట్లు కళాశాలలకు పంపించి, వాటిపై కళాశాల ప్రిన్సిపాల్‌ సంతకం ఉంటేనే పరీక్షకు అనుమతించేవారు. దీంతో ప్రైవేటు కళాశాలలు ఫీజు బకాయిలున్న విద్యార్థులకు హాల్‌టికెట్లు నిరాకరించేవారు. పరీక్షల ముందు రోజు వరకు ఫీజుల కోసం వేధించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యేవారు. తాజాగా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించారు. హాల్‌టికెట్లపై ఎవరి సంతకాలు అవసరంలేదని, ప్రింట్‌ తీసుకువస్తే పరీక్షలకు అనుమతిస్తారని అధికారులు తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు పుట్టిన తేదీ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పుట్టిన తేదీ లేదా మొదటి సంవత్సరం హాల్‌టికెట్‌ నంబరు నమోదు చేస్తే హాల్‌టికెట్‌ డౌన్‌లోడు చేసుకోవచ్చునని వివరించారు.

Updated Date - Feb 01 , 2025 | 12:56 AM