ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోటవురట్ల సీహెచ్‌సీలో కేంద్ర బృందం తనిఖీలు

ABN, Publish Date - Feb 14 , 2025 | 12:25 AM

స్థానిక 50 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను గురువారం కేంద్ర బృందం ఆకస్మికంగా తనిఖీచేసింది. కేంద్ర బృందం ప్రతినిధి డాక్టర్‌ వరుణ్‌ ఆధ్వర్యంలో సుమారు రెండు గంటలపాటు తనిఖీలు చేపట్టారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మందుల స్టాక్‌ రూమ్‌ను పరిశీలించి జాబితా ఆధారంగా ఉన్నాయా?, లేదా? అని పరిశీలించారు.

రికార్డులు పరిశీలిస్తున్న కేంద్ర బృందం ప్రతినిధి డాక్టర్‌ వరుణ్‌

రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా

కోటవురట్ల, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక 50 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను గురువారం కేంద్ర బృందం ఆకస్మికంగా తనిఖీచేసింది. కేంద్ర బృందం ప్రతినిధి డాక్టర్‌ వరుణ్‌ ఆధ్వర్యంలో సుమారు రెండు గంటలపాటు తనిఖీలు చేపట్టారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మందుల స్టాక్‌ రూమ్‌ను పరిశీలించి జాబితా ఆధారంగా ఉన్నాయా?, లేదా? అని పరిశీలించారు. ప్రతి రోజూ ఆస్పత్రికి ఎంత మంది రోగులు వస్తున్నారని సిబ్బందిని అడగగా, 200 మందికి పైగా వస్తున్నారని వారు బదులిచ్చారు. ఆస్పత్రికి వస్తున్న షుగర్‌, బీపీ రోగులకు ఇచ్చే మందులు వేర్వేరు రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారా?, లేదా? అని ప్రశ్నించారు. గర్భిణుల వార్డులో సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం తంగేడు హెల్త్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు. సెంటర్‌ ముందు ఉన్న చెత్తాచెదారాన్ని ఆయన ఫొటో తీశారు. సెంటర్‌లో మందుల కొరత ఉందా? అని ఆరా తీశారు. రికార్డుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. ఆయన వెంట జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ జగదీశ్‌ నానాజీ, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రసాద్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 12:25 AM