ఘనంగా లోకేశ్ జన్మదిన వేడుకలు
ABN, Publish Date - Jan 23 , 2025 | 11:12 PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలను గురువారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు.
జిల్లా అంతటా ఉత్సాహంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు
పాడేరులో వైద్య, రక్తదానం శిబిరాల ఏర్పాటు
ఆస్పత్రుల్లో రోగులకు పాలు, రొట్టెల పంపిణీ
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలను గురువారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పాడేరులో టీడీపీ అరకులోయ పార్లమెంటరీ అధ్యక్షుడు, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో తన క్యాంప్ కార్యాలయంలో కేకును కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. అలాగే ప్రత్యేక వైద్య, రక్తదానం శిబిరాలు నిర్వహించారు. పలువురు పేదలకు దుస్తులు పంపిణీ చేసి, భోజనాలు ఏర్పాటు చేశారు. హుకుంపేట, అరకులోయ, అనంతగిరి మండలాల్లోని జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శిరీషాదేవి ఆధ్వర్యంలో రంపచోడవరం కేంద్రంతోపాటు పలు మండలాల్లో లోకేశ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో స్థానిక మోదకొండమ్మ ఆలయంలో మంత్రి నారా లోకేశ్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి కేకు కట్ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొట్టగుళ్లి సుబ్బారావు, (టూరిజం డైరెక్టర్) కిల్లు వెంకటరమేశ్‌నాయుడు ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆస్పత్రిలో రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్ దొన్నుదొర ఆధ్వర్యంలో మంత్రి లోకేశ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Updated Date - Jan 23 , 2025 | 11:12 PM