ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మేయర్‌పై అవిశ్వాసం?

ABN, Publish Date - Feb 18 , 2025 | 01:39 AM

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలని కూటమి ప్రజా ప్రతినిధులు, నాయకులు భావిస్తున్నారు.

  • కూటమి ప్రజా ప్రతినిధుల భేటీలో చర్చ

  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మకు మద్దతుపైనా చర్చ

విశాఖపట్నం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి):

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలని కూటమి ప్రజా ప్రతినిధులు, నాయకులు భావిస్తున్నారు. వచ్చే నెల 18వ తేదీకి మేయర్‌ పదవీకాలం నాలుగేళ్లు పూర్తికానున్నది. ఆ తరువాత అవిశ్వాసం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. మేయర్‌పై అవిశ్వాసం, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించేందుకు కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు సోమవారం రాత్రి దసపల్లా హోటల్‌లో సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ ఎం.శ్రీభరత్‌, విప్‌ గణబాబు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేష్‌బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, విష్ణుకుమార్‌రాజు, ఏపీ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీలా గోవింద సత్యనారాయణ, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీరావు, జీవీఎంసీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాస్‌, తదితరులు హాజరయ్యారు. మేయర్‌ పదవీకాలం నాలుగేళ్లు పూర్తయిన తరువాత అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉందని, అందుకోసం ఇప్పటి నుంచే సన్నాహాలు చేయాలని కొందరు అభిప్రాయపడ్డారు. దీనిపై సీఎం చంద్రబాబునాయుడుతో చర్చించి, అనుమతి తీసుకోవాలని మరికొందరు సూచించారు. మేయర్‌ పదవిని జీవీఎంసీ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాస్‌ ఆశిస్తున్నారు. ఇదే విషయమై అధినేతను పలుమార్లు కలిశారు. కాగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు మద్దతుపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ విషయాన్ని పట్టభద్ర ఎమ్మెల్సీ చిరంజీవిరావు ప్రస్తావించారు. 2023లో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు రఘువర్మ మద్దతు పలికారు. అప్పటి నుంచి టీడీపీలో పలువురు నేతలతో రఘువర్మకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రధానంగా రఘువర్మ నామినేషన్‌కు చిరంజీవిరావు హాజరుకావడంతోపాటు ప్రచారం చేస్తున్నారు. రఘువర్మకు మద్దతు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించిన తరువాతే ఒక నిర్ణయానికి రావాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఈ సమావేశానికి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీకి ఆహ్వానం లేదు. అయితే ఎంపీ శ్రీభరత్‌ను కలిసేందుకు దసపల్లా హోటల్‌కు వెళ్లిన బాబ్జీని పీలా గోవింద, పీలా శ్రీనివాస్‌లు సమావేశానికి తీసుకువెళ్లారు. ఆయన కొద్దిసేపు ఉండి ఎంపీతో పాటు బయటకు వచ్చేశారు.

Updated Date - Feb 18 , 2025 | 01:39 AM