సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల పంపిణీ ప్రారంభం
ABN, Publish Date - Mar 07 , 2025 | 12:05 AM
గిరిజన నిరుద్యోగులకు సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల పంపిణీ ప్రక్రియను గురువారం ఐటీడీఏ కార్యాలయంలో ప్రారంభించారు. తొలి రోజు 78 మంది అభ్యర్థులు దరఖాస్తులు పొందారు.
అభ్యర్థులకు దరఖాస్తులు అందిస్తున్న ఐటీడీఏ ఏపీవో ప్రభాకరరావు, టీడబ్ల్యూ డీడీ రజని, తదితరులు
తొలి రోజు 78 మంది అభ్యర్థులకు అందజేత
పాడేరు, మార్చి 6(ఆంధ్రజ్యోతి): గిరిజన నిరుద్యోగులకు సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల పంపిణీ ప్రక్రియను గురువారం ఐటీడీఏ కార్యాలయంలో ప్రారంభించారు. తొలి రోజు 78 మంది అభ్యర్థులు దరఖాస్తులు పొందారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను పూరించి ఈ నెల 13వ తేదీ నాటికి తిరిగి ఐటీడీఏ కార్యాలయంలో సమర్పించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వీఎస్.ప్రభాకరరావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎల్.రజని, ఐటీడీఏ ఏవో హేమలత, పలువురు టీచర్లు పాల్గొన్నారు.
Updated Date - Mar 07 , 2025 | 12:05 AM