ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బర్లీ పొగాకు కొనుగోళ్లు ప్రారంభం

ABN, Publish Date - Jan 10 , 2025 | 10:35 PM

మండలంలో బర్లీ పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి బాలారం, కంఠారం, కొమ్మిక ప్రాంతాల్లో ఐటీసీ, మద్ది లక్ష్మయ్య కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి.

బాలారంలో బర్లీ పొగాకు కొనుగోలు చేస్తున్న ఐటీసీ కంపెనీ ప్రతినిధులు

కేజీ రూ.155 కొనుగోలు

ఇప్పటివరకు 60 టన్నుల సేకరణ

ఐటీసీ, ఎంఎల్‌ కంపెనీల లక్ష్యం రెండు వేల టన్నులు

ఈ ఏడాది రెట్టింపు దిగుబడి

రైతుల ఆనందం

కొయ్యూరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మండలంలో బర్లీ పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి బాలారం, కంఠారం, కొమ్మిక ప్రాంతాల్లో ఐటీసీ, మద్ది లక్ష్మయ్య కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. గత ఏడాది బర్లీ పొగాకు కేజీ రూ.150 ఉండగా.. ఈ ఏడాది రూ.155లకు కొనుగోలు చేపట్టాయి. ఈ రెండు కంపెనీలు ఒకే రోజు 60 టన్నుల మేర కొనుగోలు చేశాయి. మండలంలో కంఠారం, కొమ్మిక, బాలారం, బకులూరులతోపాటు మరో నాలుగు పంచాయతీలలో బర్లీ పొగాకు రెండు వేల ఎకరాలలో రైతులు సాగు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో గత ఏడాది కంటే ఈ సంవత్సరం రెట్టింపు దిగుబడి వచ్చింది. ఈ రెండు కంపెనీలు రెండు వేల టన్నులు పైబడి బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎంఎల్‌ కంపెనీ ఏరియా మేనేజర్‌ భాస్కరరావు, సర్కిల్‌ మేనేజర్‌ సనత్‌, ఐటీసీ కంపెనీ మేనేజర్‌ తారక్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన బర్లీ పొగాకు అమౌంట్‌ ఈ వారంలో రైతుల ఖాతాలలో జమ అవుతుందని మేనేజర్లు తెలిపారు.

Updated Date - Jan 10 , 2025 | 10:35 PM