ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెందుర్తి భూములపై పెద్దల ఆరా

ABN, Publish Date - Feb 20 , 2025 | 01:20 AM

పెందుర్తిలో రిటైర్డ్‌ తహశీల్దార్‌ ఖాతా నంబర్‌పై 400 ఎకరాలు ఉన్న అంశంపై లోతైన విచారణ చేయాలని జిల్లా కలెక్టర్‌ను అమరావతి పెద్దలు ఆదేశించారు. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం ప్రచురించిన కథనంపై రాజధాని అధికారులు జిల్లా బాధ్యులను వివరణ కోరారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ తప్పిదం వల్ల అలా జరిగిందని ఇటు నుంచి సమాధానం ఇచ్చారు. దానికి వారు సంతృప్తి చెందలేదు. సాంకేతికంగా అనేక అనుమానాలు ఉన్నాయని, లోతుగా విచారణ చేయాలని ఆదేశించారు. అసైన్డ్‌ భూములపై చేసిన విచారణలా ఇది ఉండకూడదని కూడా వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

లోతైన విచారణ చేపట్టాల్సిందిగా కలెక్టర్‌కు ఆదేశం

విశాఖ ఆర్డీవోకు బాధ్యతలు

రిటైర్డ్‌ తహశీల్దార్‌ పేరు ఎక్కడా లేదంటున్న స్థానిక తహశీల్దార్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి):

పెందుర్తిలో రిటైర్డ్‌ తహశీల్దార్‌ ఖాతా నంబర్‌పై 400 ఎకరాలు ఉన్న అంశంపై లోతైన విచారణ చేయాలని జిల్లా కలెక్టర్‌ను అమరావతి పెద్దలు ఆదేశించారు. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం ప్రచురించిన కథనంపై రాజధాని అధికారులు జిల్లా బాధ్యులను వివరణ కోరారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ తప్పిదం వల్ల అలా జరిగిందని ఇటు నుంచి సమాధానం ఇచ్చారు. దానికి వారు సంతృప్తి చెందలేదు. సాంకేతికంగా అనేక అనుమానాలు ఉన్నాయని, లోతుగా విచారణ చేయాలని ఆదేశించారు. అసైన్డ్‌ భూములపై చేసిన విచారణలా ఇది ఉండకూడదని కూడా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీంతో అసలేం జరిగిందో తెలుసుకోవాలని ఆర్‌డీఓ శ్రీలేఖను జిల్లా అధికారులు ఆదేశించారు. దాంతో ఆమె పెందుర్తి వెళ్లారు. ఈ అంశంపై పెందుర్తి తహశీల్దార్‌ ఆనందకుమార్‌ మాట్లాడుతూ, 2017-18 మధ్య కాలంలో వ్యవసాయ భూములన్నీ ఆన్‌లైన్‌ చేసి, వాటికి ఆధార్‌ నంబర్‌ అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఆ సమయంలో రైతులు అందుబాటులో లేకపోవడంతో స్థానిక సిబ్బంది నాటి తహశీల్దార్‌ ఆధార్‌ నంబర్‌కు లింక్‌ చేసి ఉంటారని వివరించారు. 9102 నంబరుతో ఉన్నవన్నీ వ్యవసాయ భూములేనని, అవి సుధాకర్‌ నాయుడి పేరుతో లేవని, కాకపోతే ఆయన ఆధార్‌తో లింక్‌ అయి ఉన్నాయన్నారు.

తప్పు జరిగిందని తెలిసినా సరిదిద్దని వైనం

రికార్డుల్లో తప్పులు ఉన్నాయని, చనిపోయిన తహశీల్దార్‌ ఖాతా నంబర్‌పై ఒక్క పెందుర్తి మండలంలోనే 600 ఎకరాలు ఉన్నాయంటూ రమేశ్‌ అనే యువకుడు తహశీల్దార్‌కు, జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గతంలోనే ఫిర్యాదు చేశారు. ఆ భూముల విలువ రూ.2 వేల కోట్లు అంటూ పేర్కొన్నారు. వాటిపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. తప్పులు సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఆ భూములకు మ్యుటేషన్లు కూడా చేస్తున్నారు. అవి ఎవరి పేర్ల మీదకు వెళుతున్నాయో వెల్లడించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

Updated Date - Feb 20 , 2025 | 01:20 AM