ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణకు మరో చాన్స్‌

ABN, Publish Date - Feb 05 , 2025 | 12:20 AM

పట్టణ భూగరిష్ఠ పరిమితి (అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌) చట్టం కింద స్వాధీనం చేసుకున్న భూముల్లో ఉన్న ఆక్రమణదారులు తమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది.

  • డిసెంబరు 31 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం

  • 150 గజాల వరకు ఉచితంగానే క్రమబద్ధీకరణ

  • 150 నుంచి 300 గజాల వరకూ రిజిస్ట్రేషన్‌ విలువలో 15 శాతం, 300 నుంచి 500 గజాల వరకు 30 శాతం, 500 గజాలు, ఆపైన...అయితే 100 శాతం చెల్లించాలి

  • 2023 డిసెంబరు నెలాఖరునాటికి వచ్చిన దరఖాస్తులు 687

  • తిరస్కరించినవి:150, ప్రభుత్వానికి సిఫారసు చేసినవి : 430

విశాఖపట్నం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి):

పట్టణ భూగరిష్ఠ పరిమితి (అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌) చట్టం కింద స్వాధీనం చేసుకున్న భూముల్లో ఉన్న ఆక్రమణదారులు తమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. గత ప్రభుత్వం జీవో నంబరు 84 ప్రకారం 2023 డిసెంబరు 31 వరకూ దరఖాస్తులు స్వీకరించింది. అయితే వాటిపై ఇప్పటివరకూ తుది నిర్ణయం తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తర్జనభర్జన పడి చివరకు జీవో నంబరు 84 ప్రకారమే దరఖాస్తులు తీసుకోవాలని గత నెల 27న జీవో 27 జారీచేసింది. దాని ప్రకారం ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ వరకు పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టానికి లోబడి మిగులు భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌, పట్టణ భూగరిష్ఠ పరిమితి కాంపిటెంట్‌ అధికారి కె.మయూర్‌ అశోక్‌ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ జీవో మేరకు 2019 మే ఒకటో తేదీ నాటికి సదరు మిగులు భూమిలో ఉన్నట్టు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, ఇంటి నిర్మాణం కోసం జీవీఎంసీ నుంచి తీసుకున్న ప్లాన్‌, కరెంట్‌ బిల్లు, ఇంటి, నీటి పన్ను రశీదు నకళ్లతో డిసెంబరు 31వ తేదీలోగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు సంబంధిత తహసీల్దార్‌ లేదా కలెక్టరేట్‌లోని యూఎల్‌సీ విభాగంలో అందజేయాలని కోరారు. 150 గజాల వరకు ఉచితంగా క్రమద్ధీకరించి పట్టా ఇస్తారు. 150 నుంచి 300 గజాల వరకు ప్రస్తుత రిజిస్ట్రేషన్‌ విలువలో 15 శాతం, 300 నుంచి 500 గజాల వరకు 30 శాతం, 500 గజాలు, ఆపైన...అయితే 100 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తం లెక్కించి సగం సొమ్మును ‘జాయింట్‌ కలెక్టర్‌ అండ్‌ కాంపిటెంట్‌ అథారిటీ, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌, విశాఖపట్నం పేరిట డీడీ తీసి దరఖాస్తుకు జత చేసి అందజేయాలన్నారు. సందేహాలు, ఇతర వివరాలకు సంబంధిత తహసీల్దారు కార్యాలయంలో సంప్రతించాలని కోరారు.

నగరంలో సీతమ్మధార, గోపాలపట్నం, మహారాణిపేట, గాజువాక, ములగాడ, పెదగంట్యాడ, పెందుర్తి, విశాఖ రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయాల పరిధిలో 266 హెక్టార్ల యూఎల్‌సీ భూములు ఉన్నట్టు అధికారులు గతంలో నిర్ధారించారు. వాటిలో 86 హెక్టార్లలో ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. మరో 100 హెక్టార్ల భూమిని ఇంకా గుర్తించాల్సి ఉండగా, 80 హెక్టార్లలో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, సామాజిక భవనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ 86 హెక్టార్లలో సుమారు 3,025 ఆక్రమణలు ఉన్నట్టు అప్పట్లో గుర్తించి 2023 మార్చి తరువాత 1,583 మందికి నోటీసులు ఇచ్చారు. మిగిలిన వారికి నోటీసులు ఇస్తే అప్పట్లో చాలామంది తీసుకోలేదు. 2023 డిసెంబరు 31తో గడువు ముగిసేనాటికి 687 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 150 గజాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ఆక్రమణదారులు 643 మంది, 150 గజాల పైబడి విస్తీర్ణం ఉన్నవారు 44 మంది ఉన్నారు. పలు కారణాలతో 150 దరఖాస్తులు తిరస్కరించగా, 150 గజాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్నవి 386, అంతకు మించినవి 44 వెరసి 430 దరఖాస్తులు పరిశీలించి క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వానికి పంపారు. 150 గజాల విస్తీర్ణం పైబడి ఆక్రమణదారులు రూ.3.52 కోట్లు చెల్లించారు. అయితే ప్రభుత్వానికి దరఖాస్తులు పంపినా ఒక్కటి కూడా క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేదు. దరఖాస్తుదారులు కలెక్టరేట్‌కు వచ్చి విచారిస్తూనే ఉన్నారు. చివరకు గత నెలలో జరిగిన క్యాబినెట్‌లో యూఎల్‌సీ ఆక్రమణలపై చర్చించిన మీదట గత నెల 27న జీవో ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను యథాతథంగా అమలు చేస్తూ కేవలం దరఖాస్తుల సమర్పణకు డిసెంబరు 31వ తేదీ వరకూ గడువు మాత్రమే పెంచారు.

Updated Date - Feb 05 , 2025 | 12:20 AM