ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్గానిక్‌ జిల్లాగా అల్లూరి

ABN, Publish Date - Feb 21 , 2025 | 01:12 AM

జిల్లాలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సాహించి ‘ఆర్గానిక్‌ జిలా’్లగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక కాఫీ హౌస్‌లో వ్యవసాయ, ఉద్యానవన, ప్రకృతి వ్యవసాయ శాఖల అధికారులతో రానున్న ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వ్యవసాయ ప్రణాళికపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌. పక్కన వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు

సేంద్రీయ విధానంలో పంటల సాగుకు ప్రోత్సాహం

వచ్చే ఖరీఫ్‌ నుంచే అమలు

అధికారులకు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

పాడేరు, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సాహించి ‘ఆర్గానిక్‌ జిలా’్లగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక కాఫీ హౌస్‌లో వ్యవసాయ, ఉద్యానవన, ప్రకృతి వ్యవసాయ శాఖల అధికారులతో రానున్న ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వ్యవసాయ ప్రణాళికపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి సంపూర్ణమైన ఆర్గానిక్‌ వ్యవసాయ జిల్లాగా మార్చేందుకు 2025-26 ఖరీఫ్‌ నుంచే కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించే ప్రతి రైతుకీ ‘ఆర్గానిక్‌ సర్టిఫికెట్‌’ వచ్చేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఆయన జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన అధికారులతో కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో సేంద్రీయ వ్యవసాయాభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. మూడు, నాలుగేళ్లలో సేంద్రీయ వ్యవసాయ జిల్లాగా అభివృద్ధి చేయాలన్నారు.

అల్లూరి జిల్లాకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో రైతులు సేంద్రీయ వ్యవసాయాన్ని చక్కగా అమలు చేస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ కూడా అమలు చేయాలన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా గిరిజన రైతులు లక్షా 25 వేల ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు. పంట సాగులో రసాయన ఎరువులు వినియోగిస్తున్న రైతులు ఎంత మంది ఉన్నారన్నదానిపై సమగ్ర సర్వే చేయాలని కలెక్టర్‌ సూచించారు. మండల వ్యవసాయాధికారి నేతృత్వంలో గ్రామ సర్వేయరు, వీఆర్వో, గ్రామ వ్యవసాయ సహాయకులు, వెలుగు సిబ్బంది బృందంగా ఏర్పడి సర్వే చేయాలన్నారు. ఈ సమావేశంలో పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల పీవోలు అభిషేక్‌గౌడ, సింహాచలం, దంతెవాడ కలెక్టరేట్‌ నుంచి సేంద్రీయ వ్యవసాయ నిపుణుడు ఆకాష్‌బద్వే, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నంద్‌, జిల్లా ఉద్యానవనాధికారి ఏ.రమేశ్‌కుమార్‌రావు, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ ఎల్‌.భాస్కరరావు, ఇతర పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2025 | 01:13 AM