వాసవీమాత ఆత్మార్పణ దినం
ABN, Publish Date - Feb 01 , 2025 | 12:35 AM
వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్థానిక వాసవీ మాతకు శుక్రవారం పట్టువస్ర్తాలు సమర్పించి, ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
తనకల్లు జనవరి 31(ఆంధ్రజ్యోతి): వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్థానిక వాసవీ మాతకు శుక్రవారం పట్టువస్ర్తాలు సమర్పించి, ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండలాధ్యక్షుడు రామాంజనేయులు, తహసీల్దార్ శోభాసువర్ణమ్మ, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున, తెలుగుదేశం నాయకులు రెడ్డిశేఖర్‌రెడ్డి, తోట సరోజమ్మ, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం: స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆత్మర్పణ దినాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ఉదయం అభిషేకం, కన్యకలు మంగళస్నానాలు ఆచరించి పాండురంగ స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళవాయుద్యాలతో 102 కలశాలతో ఆర్య వైశ్య మహిళలు కన్యకాపరమేశ్వరి దేవి ఆలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ సర్వదేవత హోమాలు నిర్వహించారు. అమ్మవారికి క్షీరాభిషేకం, అమ్మవారికి ఒడిబియ్యం అందజేశారు. ధర్మవరం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.
Updated Date - Feb 01 , 2025 | 12:35 AM