YS Jagan : ఆ పోలీసుల పేర్లు డైరీలో రాసుకోండి
ABN, Publish Date - Jan 09 , 2025 | 05:33 AM
రాష్ట్ర పోలీసులను ఉద్దేశించి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పోలీసులు మీపై తప్పుడు కేసులు పెట్టి ..కొట్టి .. హింసిస్తే .. వారి పేర్లను డైరీలో రాసుకోండి .. మనం
వారితోనే మీకు సెల్యూట్ కొట్టిస్తా!
నెల్లూరు వైసీపీ నేతలవద్ద జగన్ వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ
ఒక్కొక్కరితో 3 నిమిషాలు మాట్లాడిన అధినేత....విడివిడిగా వారందరితోనూ సెల్ఫీలు
అమరావతి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి ) : రాష్ట్ర పోలీసులను ఉద్దేశించి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పోలీసులు మీపై తప్పుడు కేసులు పెట్టి ..కొట్టి .. హింసిస్తే .. వారి పేర్లను డైరీలో రాసుకోండి .. మనం అధికారంలోకి వచ్చాక .. వారందరి సంగతి తేలుస్తా.కొట్టిన పోలీసులతోనే మీకు సెల్యూట్ కొట్టిస్తా’’ అని నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ నేతల వద్ద జగన్ వ్యాఖ్యానించారు. తాడేపల్లి నివాస ప్రాంగణంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మంగళవారం, నెల్లూరు జిల్లా నేతలతో బుధవారం జగన్ సమావేశమయ్యారు. కార్యకర్తలకు అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. లోకసభ నియోజకవర్గం యూనిట్‌గా వచ్చే నెల నుంచి మూడు రోజులు పర్యటనలు చేస్తానని జగన్ ప్రకటించారు. సమావేశంలో ఒక్కొక్కరికీ సగటున మూడు నిమిషాలు సమయం ఇచ్చి వారి సమస్యలు విన్నారు. అనంతరం వారితో విడివిడిగా జగన్ సెల్ఫీలు దిగారు. నెల్లూరు నేతల భుజంపై చేయి వేసి .. భవిష్యత్తులో తోడుగా ఉంటానని చెప్పారు. అయితే, కూటమి సూపర్ సిక్స్ పథకాలపై గతంలో చేసిన ప్రసంగాన్నే తిరిగి వినిపించారు. ఆయన ఉపన్యాస ధోరణిని ‘తప్పదు’ అన్నట్టు నేతలు భరించినట్టు సమాచారం. కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నదనీ, వచ్చే ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పే ప్రయత్నం చేసినా..నేతలు చెవికి ఎక్కించుకోలేదని తెలిసింది. పోలీసులపై జగన్ వ్యాఖ్యలకూ పెద్దగా స్పందన కనిపించలేదని చెబుతున్నారు.
Updated Date - Jan 09 , 2025 | 05:33 AM