ఘనంగా ఉమా మహేశ్వరస్వామి రథోత్సవం
ABN, Publish Date - Mar 01 , 2025 | 12:04 AM
బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి ఆలయంలో ఉమామహేశ్వరస్వామి రథోత్సవ వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి.
బనగానపల్లె, ఫిబ్రవరి 28 ( ఆంధ్రజ్యోతి: బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి ఆలయంలో ఉమామహేశ్వరస్వామి రథోత్సవ వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ రథోత్సవ వేడుకల్లో పాల్గొని మొదటి పూజలు చేశారు. ఆలయ ఈవో చంద్రుడు, బండి మౌళీశ్వరరెడ్డి, ఆలయ పూజారులు మహేశ్వరశర్మ, కిశోరయ్య, ఆయకట్టు గ్రామ ప్రజలు, పెద్దల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. బనగానపల్లె సీఐ ప్రవీణ్‌కుమార్, సీఐ మంజునాథరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన దొనపాటి యాగంటిరెడ్డి, పాతపాడు టీడీపీ సర్పంచ మహేశ్వరరెడ్డి, బత్తుల భాస్కర్‌రెడ్డి, రామారెడ్డి పాల్గొన్నారు.
డోన రూరల్: పట్టణం సమీపంలోని పాతబుగ్గ, కొత్తబుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో శుక్రవారం రాత్రి వేలాది మంది భక్తుల మద్య శివపార్వతుల రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. రథోత్సవ వేడుకల్లో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును నిర్వహించారు. కొత్తబుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొని మజ్జిగను పంపిణీ చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే కోట్ల, మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ముచ్చట్ల మల్లికార్జున స్వామి రథోత్సవం
బేతంచెర్ల: బేతంచెర్ల మండలంలోని మహాశివరాత్రి సందర్బంగా ముచ్చట్ల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి రథోత్సవం శుక్రవారం సాయంత్రం ఊరేగించారు. ఆలయ మాధ వీధుల్లో భక్తుల నృత్యాలు, నందికోల సేవలతో ఊరేగించారు. కార్యక్రమంలో అంబాపురం, రంగాపురం, బేతంచెర్ల, హెచ.కొట్టాల, కొమ్మూరి కోట్టాల ఆయా ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు.
Updated Date - Mar 01 , 2025 | 12:04 AM