ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD: టీటీడీలో ఫేక్‌ ఆధార్‌లకు చెక్‌!

ABN, Publish Date - Mar 11 , 2025 | 06:46 AM

ఫేక్‌ ఆధార్‌లను సులువుగా గుర్తించి, టీటీడీ అందిస్తున్న సేవల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు.

  • వసతి, దర్శన బుకింగ్‌ అక్రమాలకు అడ్డుకట్ట

  • త్వరలో అమలుకానున్న అథెంటికేషన్‌, ఈకేవైసీ

  • దేవదాయశాఖ గెజిట్‌.. ఉత్తర్వులు జారీ

(తిరుమల-ఆంధ్రజ్యోతి)

ఫేక్‌ ఆధార్‌ కార్డు నంబర్లతో తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి పొంది అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు ఇకపై చెక్‌ పడనుంది. త్వరలో ఆధార్‌ అథెంటికేషన్‌, ఈకేవైసీ అమలుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఫేక్‌ ఆధార్‌లను సులువుగా గుర్తించి, టీటీడీ అందిస్తున్న సేవల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. టీటీడీ ప్రతినెలా ఆన్‌లైన్‌ ద్వారా శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కేటాయిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొందరు వ్యక్తులు లక్కీడిఫ్‌లో ఎలాగైనా సేవలు, దర్శనం, వసతి పొందాలని కొన్ని ఆధార్‌ నంబర్లతో బల్క్‌గా రిజిస్ర్టేషన్లు చేసుకుంటున్నారు. డిప్‌ ద్వారా ఎంపికైన టికెట్‌ను అధిక ధరకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. టికెట్‌కు జతచేసిన ఆధార్‌ నంబరు, వివరాలను అలానే ఉంచి ఎవరికైతే విక్రయిస్తారో వారి ఫొటోను జత చేసి ఫేక్‌ ఆధార్‌తో తిరుమలకు పంపుతున్నారు. వసతి విషయంలోనూ ఇదే తరహా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇక, తిరుమలలోనూ కొందరు దళారులు వేరేవ్యక్తుల ఆధార్‌ కార్డుపై ఫొటోలను తొలగించి, వాటిపై తమఫొటోలను జతచేసి గదులు పొందు తూ బ్లాక్‌లో విక్రయించి అందినకాడికి దోచుకుంటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు నకిలీ ఆధార్లతో అక్రమాలకు పాల్పడుతున్న విషయాన్ని విజిలెన్స్‌ వింగ్‌ ద్వారా గుర్తించారు.


ఈక్రమంలో రిజిస్ర్టేషన్‌ సమయంలో దళారులు వినియోగించిన ఈమెయిళ్లు, ఫోన్‌ నంబర్ల ఆధారంగా అనేక మందిని గుర్తించి అరెస్ట్‌ చేశారు. అలాగే అధికంగా వినియోగించిన ఫోన్‌నంబర్లను, ఈ మెయిళ్లను కూడా బ్లాక్‌చేశారు. వాటి ద్వారా మరోసారి బుకింగ్‌ చేసుకోకుండా జాగ్రత్తపడ్డారు.

ప్రత్యేక అప్లికేషన్‌ ద్వారా..

ఈ సమస్యకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలంటే ఫేక్‌ ఆధార్‌లను గుర్తించేలా ఆధార్‌ అథెంటికేషన్‌, ఈకేవైసీని అమలుచేయడం ముఖ్యమని టీటీడీ భావించింది. టీటీడీ అందిస్తున్న ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ సేవలకు ఆధార్‌ను లింక్‌ చేయాలని నిర్ణయించింది.

Updated Date - Mar 11 , 2025 | 06:46 AM