ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు అధికారిక లాంఛనాలతో గరిమెళ్ల అంత్యక్రియలు

ABN, Publish Date - Mar 11 , 2025 | 06:20 AM

కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ (76) అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

  • తిరుపతి గోవిందధామంలో నిర్వహణకు ఏర్పాట్లు

తిరుపతి, మార్చి10(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ (76) అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీచేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు తిరుపతిలోని గోవిందధామంలో అధికారిక లాంఛనాలతో గరిమెళ్ల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి తగ్గ ఏర్పాట్ల కోసం కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో గరిమెళ్ల కన్నుమూసిన విషయం తెలిసిందే. అమెరికాలో ఉంటున్న ఆయన కుమారులు మంగళవారం ఉదయం 8 గంటలకు తిరుపతికి చేరుకోనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, గరిమెళ్ల భౌతికకాయానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ సుగుణమ్మ, సంగీత విద్యాంసులు, కళాకారులు సోమవారం ఘన నివాళులర్పించారు.

Updated Date - Mar 11 , 2025 | 06:20 AM