ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజయవాడకు రైళ్లను పునరుద్ధరించాలి

ABN, Publish Date - Mar 08 , 2025 | 11:27 PM

కర్నూలు నుండి విజయవాడకు వెళ్లే రైళ్లను పునరుద్ధరించాలని ఏఐటీయూసీ, ఏఐవై్‌ఫ, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా కార్యదర్శులు మునెప్ప, శ్రీనివాసులు, షాబీర్‌భాష, డిహెచపిఎ్‌స నగర కార్యదర్శి కుమార్‌రాజ ప్రభుత్వాన్ని కేంద్ర రైల్వేశాఖను డిమాండ్‌ చేశారు.

కర్నూలు రైల్వేస్టేషన ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు

కర్నూలు రూరల్‌, మార్చి8 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నుండి విజయవాడకు వెళ్లే రైళ్లను పునరుద్ధరించాలని ఏఐటీయూసీ, ఏఐవై్‌ఫ, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా కార్యదర్శులు మునెప్ప, శ్రీనివాసులు, షాబీర్‌భాష, డిహెచపిఎ్‌స నగర కార్యదర్శి కుమార్‌రాజ ప్రభుత్వాన్ని కేంద్ర రైల్వేశాఖను డిమాండ్‌ చేశారు. శనివారం ఆ యూనియన ఆధ్వర్యంలో సంయుక్తంగా వారు కర్నూలు రైల్వేస్టేషన ముఖద్వారం ఎదుట ఏఐటీయూసీ నగర కార్యదర్శి చంద్రశేఖర్‌ అధ్యక్షతన ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ పాత రాజధాని కర్నూలు నుంచి కొత్త రాజధాని విజయవాడకు గతంలో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైలు ఉండేదని కోరోనా సమయంలో అనేక రైళ్లను రద్దు చేయడం జరిగిందన్నారు. అమరావతితో పాటు హైకోర్టుకు వెళ్లాలన్న కర్నూలు నగర, జిల్లా ప్రజలు తప్పనిసరిగా డోన, నంద్యాలకు వెళ్లి జనరల్‌ బోగిలో ప్రయాణం చేసే పరిస్థితి నెలకొందన్నారు. విజయవాడకు వెళ్లే ప్రతి రైలుకు అదనంగా జనరల్‌ బోగీలను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే కర్నూలు ఎంపీ స్పందించి కర్నూలు నుంచి నేరుగా విజయవాడకు ప్రత్యేక రైలును నడిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమన్న, శరతకుమార్‌, చింటు, నాగరాజు, అఖిల్‌, రంగన్న పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 11:28 PM