ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD: ‘కొండంత’ జనం ఉన్నా అంతా ప్రశాంతమే!

ABN, Publish Date - Jan 09 , 2025 | 04:04 AM

లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే గరుడ సేవ, వరుస సెలవుల్లో వచ్చే భారీ భక్తజనం, ఇంకా ఎలాంటి సందర్భమైనా సరే... తిరుమలలో భక్తుల ప్రాణాలు పోయేంత విషాదాలు జరిగిన దాఖలాలే లేవు! ‘క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌’లో టీటీడీకి ఎంతో పేరు! కానీ... బుధవారం తిరుపతిలో పెను విషాదం చోటు చేసుకుంది.

తిరుమలలో పక్కాగా క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌

లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే గరుడ సేవ, వరుస సెలవుల్లో వచ్చే భారీ భక్తజనం, ఇంకా ఎలాంటి సందర్భమైనా సరే... తిరుమలలో భక్తుల ప్రాణాలు పోయేంత విషాదాలు జరిగిన దాఖలాలే లేవు! ‘క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌’లో టీటీడీకి ఎంతో పేరు! కానీ... బుధవారం తిరుపతిలో పెను విషాదం చోటు చేసుకుంది. గతంలో రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉండేది. అంతకు ఒకటి రెండు రోజుల ముందు నుంచే తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోయేది. దాదాపు 48 గంటల పాటు భక్తులు నాలుగైదు కిలోమీటర్లు వ్యాపించినప్పటికీ... చిన్నపాటి తోపులాటలు, తొక్కిసలాటలే తప్ప ఎప్పుడు ప్రాణనష్టం జరగలేదు. తిరుమలలో ఎప్పుడైనా, ఎక్కడైనా తోపులాటలు, తొక్కిసలాటలు జరిగినా నిమిషాల వ్యవధిలోనే పోలీసులు, విజిలెన్స్‌ స్పందించి... దిద్దుబాటు చర్యలు తీసుకుంటారు. 2016లో విద్యుత్‌ తీగలు తగలడంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. ఇదిమినహా... ఇప్పటిదాకా కొండమీద ఎలాంటి దుర్ఘటనలో చోటు చేసుకోలేదు. తిరుపతిలో తాత్కాలిక టోకెన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాటికోసం భారీ సంఖ్యలో జనం తరలి రావడం, అందులోనూ సమన్వయ లోపంతో ఇప్పుడు ఈ విషాదం చోటు చేసుకుంది.

Updated Date - Jan 09 , 2025 | 04:04 AM