ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: డీఆర్‌వో
ABN, Publish Date - Feb 04 , 2025 | 12:55 AM
ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలను (ఐపీఈ-2025) విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయ శాఖల అధికారులు బృంద స్ఫూర్తితో వ్య వహరించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) ఎం.ల క్ష్మీ నరసింహం కోరారు.
ఎన్టీఆర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలను (ఐపీఈ-2025) విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయ శాఖల అధికారులు బృంద స్ఫూర్తితో వ్య వహరించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) ఎం.ల క్ష్మీ నరసింహం కోరారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో డీఆర్‌వో లక్ష్మీ నరసింహం, జిల్లా ఇంటర్ వి ద్యాధికారి (డీఐఈవో) సీఎ్‌సఎ్‌సఎన్ రెడ్డి తో కలిసి పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఇంటర్ విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, పోలీసు, ప్రజా రవాణా, వైద్య ఆరోగ్యం, విద్యుత్, పోస్టల్ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఆర్‌వో మాట్లాడుతూ ఇం టర్ వొకేషనల్, జనరల్ ప్రాక్టికల్ పరీక్ష లు ఈనెల 5 నుంచి 20 వరకు 127 కేం ద్రాల్లో జరుగుతాయని, అలాగే థియరీ ప రీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయన్నారు. 41,295 మంది ఫస్టియర్ విద్యార్థులు, 39, 564 మంది సెకెండియర్ విద్యార్థులు మొ త్తం 80,859 మంది విద్యార్థులు పరీక్షల కు హాజరుకానున్నట్టు వివరించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్ అధికారులను నియమించడం జరిగిందని, 27 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్ష పత్రాలను స్టోరేజ్ పాయింట్ల నుంచి కేంద్రాలకు తరలింపు మొదలు ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. బందోబస్తు ఏర్పాటు, భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిఘాలో పోలీసు శాఖతో సమన్వయం అవసరమన్నారు. 20 కేంద్రాలకు ఒకటి చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్‌ల ఏర్పాటుకు అధికారులు, సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకొనేలా ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు నడపాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డీఆర్‌వో సూచించారు. స్పెషల్ ఆఫీసర్ ఎస్.సరళకుమారి, డీఈసీ సభ్యులు జి.ఝాన్సీ, డీఈవో యూవీ సుబ్బారావు, ఏపీఎస్ ఆర్టీసీ అధికారి కె.సురేష్ కుమార్, పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ ఎం.నరసింహాస్వామి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీసు షేక్ అహ్మద్ ఆలీ, విద్యుత్ శాఖ ఈఈ ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Updated Date - Feb 04 , 2025 | 12:55 AM