ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cashew: జీడి ధర పెరిగేనా?

ABN, Publish Date - Feb 01 , 2025 | 12:09 AM

Cashew Market Trends ఏటా జనవరి వచ్చిందంటే జీడి పిక్కల సీజను ప్రారంభమై ఉద్దానం గ్రామాల్లో సందడి నెలకొంటుంది. రైతులు జీడి తోటల్లో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని జీడి పిక్కలను సేకరిస్తుంటారు.

ఉద్దానంలో కాపుకాస్తున్న జీడి తోటలు..
  • ఏడేళ్లుగా గిట్టుబాటు ధర కరువు

  • బస్తా పిక్కలు రూ.10వేలు పలుకుతున్న వైనం

  • రూ.16వేలు ఇవ్వాలంటున్న రైతులు

  • అంత ధరకు కొనుగోలు చేయలేమంటున్న వ్యాపారులు

  • కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

    పలాస, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ఏటా జనవరి వచ్చిందంటే జీడి పిక్కల సీజను ప్రారంభమై ఉద్దానం గ్రామాల్లో సందడి నెలకొంటుంది. రైతులు జీడి తోటల్లో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని జీడి పిక్కలను సేకరిస్తుంటారు. వాటిని విక్రయిస్తూ వచ్చే ఆదాయంతో ఏడాదంతా కుటుంబంతో ఆనందంగా గడుపుతుంటారు. అయితే, గత ఏడేళ్లుగా జీడి పిక్కల దిగుబడి బాగున్నా, ఆశించిన మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఎకరా జీడి తోటలో ఫలసాయం పొందాలంటే రూ.15వేల వరకూ పెట్టుబడి అవుతుంది. ప్రకృతి కరుణిస్తేనే పంట చేతికి అందుతుంది. లేదంటే నష్టపోవాల్సిందే. జిల్లాలో ఉద్దానంతోపాటు ఏజెన్సీ ప్రాంతంలో 27వేల హెక్టార్లలో జీడి పంట సాగవుతోంది. ప్రస్తుతం పలాస మార్కెట్‌లో విదేశీ జీడి పిక్కల బస్తా(80 కిలోలు) రూ.14,500 వరకూ పలుకుతుండగా, దేశీయ పిక్కలను మాత్రం రూ.10వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. ఈ ఏడాదైనా గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

  • గిట్టుబాటు ధర కోసం పోరాటం..

    దేశీయ జీడి పిక్కలకు గిట్టుబాటు ధర కల్పించాలని జిల్లావ్యాప్తంగా ఉన్న జీడి రైతులు ఒకేతాటిపైకి వచ్చి ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ఫలితం శూన్యం. ఏటా అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వాలు వారికి ఊరటనిస్తున్నాయే తప్ప గిట్టుబాటు ధరపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లడం లేదనే విమర్శలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం జీడి బస్తాకు రూ.వెయ్యి పెంచుతామని చెప్పడంతో రైతులు ఆనందపడ్డారు. తీరా జీడి పిక్కలు చేతికందిన తరువాత మొండిచేయి చూపించింది. దీంతో తమకు తోచిన ధరకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జీడి రైతాంగ సాధన కమిటీ నాయకులు గ్రామాల్లోకి వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పిక్కలను తమ వద్దే ఉంచుకోవాలని, ధర వస్తే ఇద్దామని రైతులకు చెబుతున్నారు. ప్రస్తుతం 80 కిలోల జీడి పిక్కల బస్తాకు రూ.16వేలు గిట్టుబాటు ధర కావాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, అంత ధరకు తాము కొనుగోలు చేయలేమని వ్యాపారులు చెబుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇద్దరి మధ్య చర్చలు జరిపి, ఇరువర్గాలకూ ఆమోదయోగ్యమైన ధరను నిర్ణయించాల్సిన అవసరం ఉంది.

  • మద్దతు ధర ప్రకటించాలి

    జీడి పిక్కల ధరల అంశాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించా రు. దీనిపై ప్రభుత్వం స్పందించి ధర పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ, జీవో ఇప్పటికీ విడుదల కాకపోవడంతో రైతుల్లో నైరాశ్యం నెలకొంది. శాఖాపరమైన చర్యలు చేపట్టి తక్షణమే జీడికి మద్దతు ధర ప్రకటించాలి.

    - తెప్పల అజయ్‌కుమార్‌, జీడి రైతాంగ సాధన కమిటీ కన్వీనర్‌

Updated Date - Feb 01 , 2025 | 12:09 AM