ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ARASAVALLI స్వామీ ఇదేంది?

ABN, Publish Date - Mar 08 , 2025 | 12:36 AM

అది దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన సూర్యభగవానుడి దేవాలయం. నిత్యమూ వేలాది మంది భక్తులు తమ ఆరోగ్యం కోసం స్వామివారిని దర్శించుకునేందు వస్తుంటారు.

ఉదయం 11.50 గంటలైనా ఖాళీగా ఉన్న ఆలయ కార్యాలయం
  • ఆదిత్యాలయంలో సిబ్బంది నిర్లక్ష్యం

  • కానరాని సమయపాలన

  • ఉదయం 11.50 గంటలైనా ఖాళీగానే కుర్చీలు

  • రోజు రోజుకూ దిగజారుతున్న పరిస్థితులు

అరసవల్లి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): అది దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన సూర్యభగవానుడి దేవాలయం. నిత్యమూ వేలాది మంది భక్తులు తమ ఆరోగ్యం కోసం స్వామివారిని దర్శించుకునేందు వస్తుంటారు. అనతి కాలంలోనే భక్తుల తాకిడితో ఏడాదికి రూ.8 కోట్ల పైబడిన ఆదాయంతో డీసీ స్థాయికి ఎదిగింది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ప్రసాద పథకం ద్వారా ఆలయ అభివృద్ధి కోసం, దేశంలోనే ఒక సుందర పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు రూ.100కోట్ల నిధులు తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. జిల్లాకే తలమానికంగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. కానీ ఆలయా నికి సంబంధించి పరిస్థితులు రోజురోజుకు దిగజారి పోతున్నాయని భక్తులు వాపోతున్నారు. శుక్రవారం ఉదయం 11.50 గంటల సమయమైనా ఒక్క ఉద్యోగి కూడా లేకపోవడంతో కుర్చీలు ఖాళీగా కని పించాయి. ఇదీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో సిబ్బంది పరిస్థితి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆలయానికి సం బంధించి ఇద్దరు దినసరి వేతన సిబ్బంది తప్పా కార్యాలయ సిబ్బంది ఒక్కరూ లేరు. ఆలయానికి వచ్చే భక్తులు కార్యాలయా నికి వచ్చే అధికారులను కలవాలంటే ఆఫీసు ఖాళీగా కనిపించ డంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఆలయ ఈవో క్యాంపులో ఉన్న సమయంలో కూడా సిబ్బంది ఒక్కరూ కూడా విధులకు హాజరు కాకపోవడం దారుణం. పూర్తి ఖాళీగా ఉన్న కుర్చీలతో కార్యాలయం వెలవెలబోతోంది.

కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి..

గత కొన్ని నెలలుగా ఆలయంలో ఎవరు ఏయే విధులు నిర్వర్తిస్తున్నారో, నిర్వహించాలో పట్టించుకునే నాథుడే కరువయ్యా డు. మాఘమాసం ఆదివారాల్లో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనాలకు వచ్చారు. ఆలయానికి రూ.లక్షల్లో ఆదాయం కూడా లభిస్తుంది. కానీ భక్తులు ఎండలోనే ఇబ్బందులు పడుతూ స్వా మివారిని దర్శించుకుని వెనుదిరగడం కనిపించింది కానీ, వారికి నీడ కల్పించేందుకు ఆలయ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. గతంలో భక్తులకు తాగునీరు, మజ్జిగ, బిస్కెట్‌ ప్యాకెట్స్‌ పంపిణీ చేసేవారు. ఇప్పుడు కనీసం తాగునీరు కూడా అందించే పరిస్థితి లేదు. అరసవల్లికి చెందిన కొంతమంది స్వచ్ఛం దంగా ముందుకు వచ్చి ప్రతీ ఆదివారం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు తాగునీరు అందిస్తున్నారు. ఆలయానికి ప్రొటోకాల్‌ దర్శనానికి ఉన్నతాధికారులు, నాయకులు వస్తే పరిస్థితి ఏంటని, దినసరి వేతన సిబ్బంది ఎంతవరకు బాధ్యత తీసుకోగలరని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించడం ఎన్నడూ చూడలేదని స్థానికులు వాపోతున్నారు. అలాగే దినసరి వేతన ఉద్యోగులకు విధులను ప్రణాళికా బద్ధంగా కేటాయిస్తే ఆలయం ఒక క్రమపద్ధతిలో నడుస్తుందని, కానీ కేవలం ఒకరిద్దరిపైనే మొత్తం పనిభారం పడడంతో వారు కూడా తీవ్ర ఒత్తిడిలో విధులు పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆలయ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి, పరిస్థితులను చక్కదిద్దాలని, స్వామివారి దర్శనా నికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Mar 08 , 2025 | 12:36 AM