ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Negligence of ANM: వ్యాక్సిన్‌ వేశారు.. సూది మరిచారు..

ABN, Publish Date - Jan 30 , 2025 | 12:17 AM

Negligence of ANM: పుట్టిన బిడ్డకు వ్యాక్సిన్‌ వేసిన తరువాత సూది తీయడాన్ని మరిచిపోయింది ఓ మేటీ అసిస్టెంట్‌ (ఏఎన్‌ఎం). దీంతో నాలుగు రోజుల పాటు ఆ శిశువు తొడకే సూది ఉండిపోయింది.

బిడ్డతో తల్లి కల్పన. శిశువు తొడలో గుర్తించిన సూది

టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏఎన్‌ఎం నిర్లక్ష్యం

నాలుగు రోజుల తరువాత గుర్తించిన శిశువు తల్లిదండ్రులు

టెక్కలి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): పుట్టిన బిడ్డకు వ్యాక్సిన్‌ వేసిన తరువాత సూది తీయడాన్ని మరిచిపోయింది ఓ మేటీ అసిస్టెంట్‌ (ఏఎన్‌ఎం). దీంతో నాలుగు రోజుల పాటు ఆ శిశువు తొడకే సూది ఉండిపోయింది. తరువాత గుర్తించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చోటుచేసుకుంది. సంతబొమ్మాళి మండలం పెద్దమర్రిపాడు గ్రామానికి చెందిన తిరుమరెడ్డి కల్పన అనే గర్భిణి ఈనెల 24న టెక్కలి ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. మూడున్నర గంటల తరువాత ఆ శిశువుకు మేటీ అసిస్టెంట్‌ లక్ష్మి హెపటైటిస్‌-బి ఫస్ట్‌డోస్‌ వేసింది. ఆ తరువాత బిడ్డతో పాటు కల్పన ఇంటికి చేరుకుంది. నాలుగు రోజుల తరువాత బిడ్డకు స్నానం చేసేందుకు సిద్ధం చేయగా తొడ వాచిపోయి ఉండడాన్ని తల్లిదండ్రులు గమనించారు. మరింత లోతుగా పరిశీలించగా వ్యాక్సిన్‌ వేసిన ప్రాంతంలో సూది కనిపించింది. దీంతో హుటాహుటిన టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకున్నారు. ఇలాగే వ్యాక్సిన్‌ వేస్తారా అని సిబ్బందిని నిలదీశారు. వ్యాక్సిన్‌ వల్ల తొడ వాసింది అనుకున్నామే తప్ప అందులో సూది ఉందని మొదటి మూడురోజులు గుర్తించలేకపోయామని ఆ శిశువు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.సూర్యారావును వివరణ కోరగా.. ‘నా దృష్టికి విషయం వచ్చింది. సంబంధిత మేటీ అసిస్టెంట్‌ లక్ష్మిని పిలిచి వివరణ కోరాను. తాను ఎంతోమంది పిల్లలకు వ్యాక్సిన్‌ వేస్తుంటానని, అలా సూది మర్చిపోవడం ఎప్పుడూ జరగలేదని ఆమె చెబుతుంది.’ అని తెలిపారు.

Updated Date - Jan 30 , 2025 | 12:17 AM