ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Praja Darbar సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్‌ లక్ష్యం

ABN, Publish Date - Feb 07 , 2025 | 12:17 AM

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. స్థానిక విశాఖ-ఏ కోలనీలో గల తన కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల నుంచి గు రువారం వినతులు స్వీకరించారు. ఈ వినతదులపై తక్షణం స్పందిస్తూ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లు, కాలువల నిర్మాణం వంటి కనీస వసతులపై అధికంగా విజ్ఞప్తులు వస్తున్నాయని, గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో కనీస వసతులను కల్పించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్య స్థాపనకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 12:17 AM