Surveillance నిర్మానుష్య ప్రదేశాల్లో నిఘా
ABN, Publish Date - Feb 17 , 2025 | 12:10 AM
నిర్మానుష్యమైన ప్రదేశా ల్లో డ్రోన్ కెమేరాలతో నిఘా పెట్టి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేసేందుకు పోలీసులు నిఘాపెడుతు న్నారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమేరాలతో పోలీసులు పర్యవేక్షణ
శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): నిర్మానుష్యమైన ప్రదేశా ల్లో డ్రోన్ కెమేరాలతో నిఘా పెట్టి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేసేందుకు పోలీసులు నిఘాపెడుతు న్నారు. ఈ క్రమంలో ఆదివారం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని డచ్ బంగ్లా, కంపోస్టు కాలనీ, వాంబే కాలనీ, అరసవల్లి, దమ్మలవీధి, కిల్లిపాలెం, నాగావళి, పొన్నాడ వంతెన తదితర ప్రాంతాల్లో డ్రోన్ కెమేరాలతో పర్యవేక్షించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.
Updated Date - Feb 17 , 2025 | 12:10 AM