విద్యార్థిని ఆత్మహత్య
ABN, Publish Date - Feb 19 , 2025 | 11:43 PM
మందస మండలం లోహరిబంద గ్రామంలో విద్యార్థిని కర్రి అనూష బుధ వారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మ హత్యకు పాల్పడింది.
హరిపురం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మందస మండలం లోహరిబంద గ్రామంలో విద్యార్థిని కర్రి అనూష బుధ వారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మ హత్యకు పాల్పడింది. మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. గ్రామంలోని హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అనూష ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనం చేసి పాఠశాల నుంచి వెళ్లిపోయింది. దీంతో ఉపాధ్యాయులు అనూష కోసం ఇంటికి కబురు పెట్టగా రాలేదని తెలిసి తల్లిదండ్రులతో కలిసి తోటలలో వెతికారు. తమ సొంత తోటలో జీడి చెట్టుకు చున్నీతో ఉరి వేసుకొని ఉండడాన్ని గమ నించారు. మృతికి కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని హరిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఆవులను కబేళాకు తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
పలాస, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఆవులు కొనుగోలు చేసి కబేళాకు తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి ఆవులను గోరక్షణ శాలకు తరలించి నట్లు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు. ఏడు ఆవులను కొను గోలు చేసుకొని వాటిని వ్యానులో తరలిస్తుండగా బుధవారం పట్టుకొని కరగాన తవిటయ్య, టి.అశిరితాత, టి.మాధవరావులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఒడిశా మద్యం బాటిళ్లతో ఒకరు..
పలాస, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పెంటిభద్ర గ్రామానికి చెందిన సవర రాజ్‌కుమార్ 25 ఒడిశా మద్యం బాటిళ్లను తరలిస్తుండగా బుధవారం కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు తనిఖీ చేస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు. ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు.
మద్యం సీసాల స్వాధీనం
కొత్తూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): పాత హిరమండలానికి చెందిన జయలక్ష్మి నుంచి 8 క్వార్టర్ బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకొని కేసు నమో దు చేసినట్లు ఎక్సైజ్ ఎస్‌ఐ అప్పారావు తెలిపారు. అలాగే చింత మాను కాలనీలో 20 సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ శ్రీకాకుళం సిఐ లీలారాణి, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Feb 19 , 2025 | 11:43 PM