Struggle బలవంతపు భూసేకరణకు పాల్పడితే పోరాటం
ABN, Publish Date - Jan 07 , 2025 | 12:02 AM
Struggle ఉద్దానంలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాభిప్రా యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా బల వంతపు భూసేకరణకు పాల్పడితే పోరా టం ఉధృతం చేస్తామని వామపక్ష నేతలు హెచ్చరించారు.
పలాసరూరల్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఉద్దానంలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాభిప్రా యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా బల వంతపు భూసేకరణకు పాల్పడితే పోరా టం ఉధృతం చేస్తామని వామపక్ష నేతలు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు డి.గోవిందరావు, చాపర వేణు, న్యూడెమోక్రసీ నాయకుడు మద్దిలి రామా రావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మందస, వజ్రపు కొత్తూరు మండలాల పరిధిలో సముద్ర తీరానికి ఆనించి ఉన్న 20 గ్రామాల ప్రజలకు సంబంధించిన భూములను ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ప్రణాళికలు అమలు చేస్తు న్నారని, ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి ముసుగులో సముద్ర తీర ప్రాంతాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తామ న్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు గణపతి, కె.కేశ వరావు, మహిళా నాయకులు పి.కుసుమ, సుశీల, శ్రీదేవి పాల్గొన్నారు.
Updated Date - Jan 07 , 2025 | 12:02 AM