Antyakriyalu తమ్ముడి మృతదేహానికి అక్క అంత్యక్రియలు
ABN, Publish Date - Feb 07 , 2025 | 11:38 PM
Antyakriyalu తమ్ముడి మృతదేహానికి అక్క అంత్య క్రియలు నిర్వహించిన ఘటన శుక్రవారం హరిదాసుపురంలో జరిగింది.
దహన సంస్కారాలు చేస్తున్న సోదరి
నందిగాం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): తమ్ముడి మృతదేహానికి అక్క అంత్య క్రియలు నిర్వహించిన ఘటన శుక్రవారం హరిదాసుపురంలో జరిగింది. గ్రామానికి చెందిన కణితి సుధాకర్ (32) అనారోగ్యంతో మృతిచెందాడు. తండ్రి మూడేళ్ల కిందటే మృతి చెందగా, తల్లి కంటి చూపు సమస్యతో బాధ పడుతోంది. భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోవడంతో సోదరి కృష్ణవేణి తమ్ముడికి దహన సంస్కారాలు చేసి చితికి నిప్పటించింది.
Updated Date - Feb 07 , 2025 | 11:38 PM